
సూర్యారావుపేట బీచ్‌లో క్లీన్ అప్ డ్రైవ్
కాకినాడ రూరల్: అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రతా దినోత్సవం (ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్ అప్ డే) సందర్భంగా సూర్యారావుపేటలోని న్యూ ఎన్టీఆర్ బీచ్‌లో శనివారం ఉదయం క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు పాల్గొని, సుమారు వెయ్యి కిలోల చెత్త, వ్యర్థాలను సేకరించారు. వాటిని కాకినాడ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఓఎన్‌జీసీ ఈడీ, అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, రిలయన్స్, వేదాంత ఆయిల్స్, సీ పోర్టు, మైరెన్ పోలీసులు, పతంజలి, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, కాకినాడ కార్పొరేషన్ సిబ్బంది, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు విద్యార్థులు మూడు గంటల పాటు శ్రమదానం చేసి 2.5 కిలో మీటర్ల తీరాన్ని శుభ్రం చేశారు.