
నేడు, రేపు లేఖర్ల పెన్‌డౌన్
అమలాపురం టౌన్: జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన దస్తావేజు లేఖర్లు లోపభూయిష్టమైన 0.2 విధానాన్ని నిరసిస్తూ శుక్ర, శనివారాల్లో పెన్‌డౌన్ నిరసనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన లేఖర్లు గురువారం వినతి పత్రాల ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చినట్లు జిల్లా సంఘం కన్వీనర్ మట్టపర్తి రాము తెలిపారు. తమ నిరసనకు ఆస్తుల క్రయ విక్రయదారులు, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రోజుకు దాదాపు 400 రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లా నుంచి రెండు రోజుల్లో దాదాపు రూ.1.2 కోట్ల వరకూ నష్టం వస్తుందని భావిస్తున్నారు.