కక్షతోనే హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

కక్షతోనే హత్యాయత్నం

Sep 18 2025 7:27 AM | Updated on Sep 18 2025 7:27 AM

కక్షతోనే హత్యాయత్నం

కక్షతోనే హత్యాయత్నం

కాకినాడ రూరల్‌: రమణయ్యపేట గ్రామ పరిధిలో సర్పవరం జంక్షన్‌ వద్ద పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న గోపికృష్ణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో సీ–4 ప్లాట్‌లో డీజిల్‌ పోసి నిప్పు పెట్టిన సంఘటనలో నిందితుడు పెంట్‌ హౌస్‌లో ఉండే పొన్నగంటి రవిచంద్రకుమార్‌ (రవి)ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సర్పవరం ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ వివరాల ప్రకారం నిందితుడు వ్యక్తిగత కక్షతోనే 14న అర్ధరాత్రి సీ–4 ప్లాట్‌లో నివాసం ఉంటున్న పిల్లి సత్తిబాబుపై హత్యాయత్నం చేసేందుకు ప్లాట్‌ హాలులో డీజిల్‌ పోసి నిప్పు పెట్టాడని ఎస్సై తెలిపారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఏ హానీ జరగలేదని, అయితే హాలులో ఫర్నిచర్‌ పూర్తిగా దగ్ధమయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement