
13 రోజుల తరువాత చేరిన మృతదేహం
మలికిపురం: ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం గల్ఫ్ దేశమైన దుబాయికి వెళ్లిన రామరాజులంక గ్రామానికి చెందిన రాపాక విజయభారతి ఈ నెల 3న దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందింది. 13 రోజుల తరువాత మంగళవారం ఆమె మృతదేహం స్వగ్రామానికి చేరింది. దుబాయ్‌లోని సమీప బంధువులు, అడ్వకేట్ నల్లి శంకర్ కృషితో తగిన విదేశీ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, నల్లి శివకుమార్ తదితరులు ఆమె మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.