రాజోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు శివకోటి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని యడ్ల రిషిత అర్హత సాధించిందని ప్రధానోపాధ్యాయుడు ఎన్.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో రిషిత ప్రతిభ చూపింది. సర్పంచ్ నక్కా రామారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు చొప్పల చంద్రశేఖర్ తదితరులు అభినందించారు.
జేవీవీ రాష్ట్ర పర్యావరణ కమిటీ కన్వీనర్ల ఎంపిక
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)/కడియం: జన విజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర పర్యావరణ కమిటీ ముగ్గురు సభ్యుల బృందాన్ని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మణరావు, టి.సురేష్ మంగళవారం ప్రకటించారు. కోనసీమ జిల్లా నుంచి కన్వీనర్‌గా కేవీవీ.సత్యనారాయణ, కో కన్వీనర్లుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లాకు చెందిన జి.సుధాకర్‌లను ఎంపిక చేశారు. ఎంపికై న ముగ్గురూ జనవిజ్ఞాన వేదికలో గత మూడు దశాబ్దాలుగా వివిధ కేడర్లలో విశేషమైన సేవలు అందించారు.
రైఫిల్ షూటింగ్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు రిషిత