
గర్జించే సింహం కన్నా గాయపడినది ఇంకా ప్రమాదకరం
● జగనన్న 2.0 చూడబోతున్నారు
● ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహమే ప్రమాదకరమని చంద్రబాబు గుర్తించుకోవాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కాకాణి మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ నాలుగు ప్రధానమైన మూలస్తంభాల ఆధారంగా ప్రజాస్వామ్య సంరక్షణకు అంబేడ్కర్ రాజ్యాంగం రచిస్తే, చంద్రబాబు.. ఆయన తనయుడు నారా వారి రెడ్ బుక్‌తో నాలుగు వ్యవస్థలను ఏర్పరచుకుని రాష్ట్రాన్ని ఏలుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీలో ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎటువంటి కేసులు పెట్టాలి. జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలి, అనుకూల మీడియాతో ప్రజల్లోకి ఎలా తప్పుడు సంకేతాలు పంపాలనే నాలుగింటిపై పాలన జరుగుతోందన్నారు. మీరు చేస్తున్న ఈ పనుల వల్ల మీ శాడిజాన్ని తీర్చుకోగలరేమో కానీ మిథున్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి 86 రోజులు జైలులో పెట్టి నిర్బంధించిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మమ్మల్ని ఆపలేరన్నారు. రెండో విడత జగనన్న 2.0 చూడబోతున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా రైతులు యూరియా, విత్తనాల కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితులు ఏర్పడ్డాయా అన్నారు. చంద్రబాబు తెచ్చిన లక్షల టన్నుల యూరియా రైతులకు అందకుండా ఏమైందన్నారు. యూరియా బ్లాక్ లో అమ్ముకోవడానికి రూ.250 కోట్లు చేతులు మారాయన్నారు. ఈ నెల 19వ తేదీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపుమేరకు రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీల వద్ద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కాటసాని రామ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఏ నాయకుడి మీదైనా కేసు పెట్టొచ్చన్నారు. ఈ విధమైన పరిపాలన, పోలీసు వ్యవస్థలను తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నానన్నారు. గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ఆధారాలు లేని అభియోగాాలు మోపి జైల్లో పెట్టారని మిథున్‌రెడ్డి చెబుతున్నారన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ జగనన్న వేసిన పునాదిపై సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.