ఇలా వెలుగుబెట్టారు | - | Sakshi
Sakshi News home page

ఇలా వెలుగుబెట్టారు

Sep 16 2025 7:49 AM | Updated on Sep 16 2025 7:49 AM

ఇలా వ

ఇలా వెలుగుబెట్టారు

కానరాని కంటి వెలుగు

ఈ ప్రభుత్వంలో కంటి వెలుగు అనేది కనిపించడం లేదు. ఎక్కడా కంటి వెలుగు శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. గత ప్రభుత్వంలో కంటి వెలుగు పేరుతో మా ప్రాంతంలోనే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. మా లాంటి పేదోళ్లకు ఏదైనా కంటి జబ్బులు వస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అంటే డబ్బులు కూడా అయిపోతున్నాయి.

– బీర అర్జునరావు, సావరం, అమలాపురం

ఈఐ సెంటర్లను మళ్లీ నిర్వహించాలి

గత ప్రభుత్వంలో ఉచిత కంటి వైద్యం కోసం అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి ఈఐ సెంటర్లను మళ్లీ ఇప్పుడు నిర్వహించాలి. ఈఐ సెంటర్లు ఇప్పుడు లేకపోవడంతో చాలా మంది పేదవారికి కంటి వైద్యం ప్రభుత్వపరంగా అందడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈఐ సెంటర్ల ఏర్పాటుతో పాటు వైద్య శిబిరాలు గ్రామాల్లో ప్రజలకు చేరువలోనే నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలు అప్పుడప్పుడు శిబిరాలు నిర్వహిస్తున్నా కంటి వైద్య శిబిరాలు తక్కువగానే నిర్వహిస్తున్నారు.

– ఆకుల ఈశ్వరరావు, వానపల్లిపాలెం,

ఉప్పలగుప్తం మండలం

అటకెక్కిన కంటి వెలుగు

నిలిచిపోయిన ‘ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు’

కంటి వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్న రోగులు

కూటమి ప్రభుత్వంలో కానరాని

ఉచిత కంటి వైద్యం

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటే ఇంద్రియాలన్నింటిలో కన్ను ప్రధానమైనదని అర్థం. కంటి విలువను గుర్తించే అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యలతో బాధపడకూడదనే సదుద్దేశంతో ‘కంటి వెలుగు’ ద్వారా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి లోపాలుంటే కంటి శస్త్రచికిత్సలకు సిఫారసు చేసేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ముందుచూపు కొరవడి ఎంతో ఉపయోగమైన ‘కంటి వెలుగు’ పథకాన్ని అటకెక్కించింది.

అమలాపురం టౌన్‌: మనిషికి కంటి చూపు అతి ముఖ్యం. కళ్లకు ఏదైనా అస్వస్థతగా ఉంటే రోగులు తక్షణమే ఆస్పత్రులకు వెళ్లి నయం చేయించుకుంటారు. అందుకే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంటి వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఉచిత వైద్య శిబిరాల ద్వారా కంటి వెలుగు విషయంలో అప్రమత్తంగా ఉండేవారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా కంటి సమస్యలు ఉన్న రోగులకు ఎప్పటికప్పుడు ఉచిత వైద్యం అందేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కంటి వెలుగు మసక బారింది. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు నిలిచిపోయాయి. కంటి వెలుగు కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాల ఊసే లేదు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణ ఒక ప్రైవేటు సంస్థ పర్యవేక్షించేది. ఒక్కో కేంద్రంలో ఒక ఆప్తమాలజీ అసిస్టెంట్‌, ఓ ఎక్వీప్‌మెంట్‌ అసిస్టెంట్‌ అందుబాటులో ఉండి సేవలు అందించేవారు. ఈ కేంద్రాల ద్వారా అధునాతన ఆటోమేటిక్‌ రిఫ్రాక్షన్‌ మీటర్‌, కంటి లోపలి భాగాలను పరీక్షించే ఫండస్‌ కెమెరాలతో కంటి కంప్యూటీకరణతో పరీక్షించే విధానం ఉండేది. కంప్యూటీకరణ ద్వారా డీఆర్‌, గ్లకోమా, కేటరాక్ట్‌, మాక్యులర్‌ డీజనరేషన్‌, హైపర్‌ టెన్షన్‌ తదితర పరీక్షలు జరిగేవి. అవసరమైన కంటి రోగులకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసేవారు.

తొలిదశలోనే కంటి సమస్యల గుర్తింపు

గత ప్రభుత్వంలో కంటి సమస్యలను తొలి దశలోనే గుర్తించే ఉచిత వైద్య ప్రక్రియ అందుబాటులో ఉండేది. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం ద్వారా కంటి రోగానికి వైద్యం జరిగితే మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే ఆ రోగిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి తలించి పూర్తి ఉచిత వైద్యం అందించే పరిస్థితి ఉండేది.

కాంట్రాక్ట్‌ సంస్థతో ముగిసిన ఎంవోయూ గడువు

ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఎవరికై నా కంటి సమస్య తలెత్తితే ఉచిత వైద్యం అందించే పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కానరావడం లేదు. అదే గత ప్రభుత్వంలో జిల్లా నుంచి దాదాపు 90 వేల మంది కంటి రోగులు ప్రభుత్వ వైద్యం ద్వారా ఉచిత సేవలు పొందారు. ఒక్కో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం ద్వారా రోజుకు సగటున 30 నుంచి 50 మంది కంటి రోగులు ఉచిత పరీక్షలు చేయించుకునే వారు. జిల్లాల్లోని 9 కమ్యూనిటీ ఆస్పత్రులు, 7 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 77 పీహెచ్‌సీల్లో ఐఈ కేంద్రాలు పని చేసేవి. గత ఏడాది ఈ ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలను పర్యవేక్షించే కాంట్రాక్ట్‌ సంస్థతో ఎంఓయూ గడువు ముగిసిపోవడం, మరలా దానిని రెన్యువల్‌ చేయకపోవడంతో ఈ వ్యవస్థ నిలిచిపోయింది.

గతంలో కంటి సమస్యలకు ఉచిత వైద్యం అందుకున్న ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ ఉచిత వైద్యం గగనం కావడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వ్యవ ప్రయాసలకోర్చి వెళుతున్నారు. కన్సల్టింగ్‌ ఫీజు, మందుల కొనుగోలు, కళ్లజోళ్ల కొనుగోలు తదితర వాటికి రూ.1000 నుంచి రూ.2 వేలు ఖర్చు అవుతోందని రోగులు అంటున్నారు. పేద రోగులు కంటి వైద్యం కోసం అంతంత ఖర్చు పెట్టాల్సి రావడంతో వారు ఆర్థికంగా ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేస్తున్నాం

ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు కంటి సమస్యలపై స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేస్తున్నామని అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కంటి వైద్య మెడికల్‌ ఆఫీసర్‌ ఎ.హేమలత తెలిపారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు నిలిచిపోయాయని చెప్పారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆప్తమాలజీ విభాగం ద్వారా ఉచిత సేవలు అందుతున్నాయన్నారు.

ఇలా వెలుగుబెట్టారు1
1/3

ఇలా వెలుగుబెట్టారు

ఇలా వెలుగుబెట్టారు2
2/3

ఇలా వెలుగుబెట్టారు

ఇలా వెలుగుబెట్టారు3
3/3

ఇలా వెలుగుబెట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement