
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థినులు
తుని రూరల్: ఈనెల 27 నుంచి మూడు రోజులు ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల బాలికలు ఎంపికై నట్టు ఆ పాఠశాల వి.కొత్తూరు ప్రిన్సిపాల్ డి.ప్రసన్నరాణి సోమవారం తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలో జూనియర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో తమ విద్యార్థినులు ప్రతిభ ప్రదర్శించడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నటుట్ట ఆమె పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్‌లో హర్షిణి ప్రథమస్థానాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 క్రీడా పోటీల్లో చదరంగంలో వైష్ణవి (ప్రథమ), మణి (6వ), యోగాలో పి.అనురాధ (ప్రథమ), కె.అక్షయ కీర్తి (ద్వితీయ), ఎస్.మేఘనశ్రీ (తృతీయ), ఎం.విజీన (నాలుగో) స్థానాల్లో నిలిచారన్నారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, పీడీ ఆర్.విజయలక్ష్మి, పీఈటీ జి.సుజాత, ఉపాధ్యాయులు అభినందించారు.