ఫ కూటమి ప్రభుత్వ విధానాలపై
తిరుగుబాటు
ఫ ఉపాధ్యాయ సమస్యలపై
శ్రీరణభేరిశ్రీకి సిద్ధం
ఫ నేటి నుంచి 20 వరకూ
ఉమ్మడి జిల్లాలో జాతా
ఫ 25న విజయవాడలో బహిరంగ సభ
కపిలేశ్వరపురం: అక్షరాలు దిద్దించే గురువులకు ఆపసోపాలు తప్పడం లేదు.. భావితరం రాతను మార్చే ఉపాధ్యాయుల తలరాత మారడం లేదు.. సమాజ నిర్ధేశకులుగా పిలిచే ఆ బోధకుల బాధను ప్రభుత్వం తీర్చడం లేదు.. చెప్పి చెప్పి విసిగిపోయిన వారు ప్రభుత్వానికి గుణ్ఙపాఠంశ్రీ చెప్పేందుకు సిద్ధమయ్యారు.. ప్రభుత్వ విద్యను కాపాడే కార్యాచరణలో భాగంగా యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో శ్రీరణభేరి జాతాశ్రీ పేరుతో విద్యారంగ పరిరక్షణకు కార్యాచరణ చేపట్టారు. సోమవారం నుంచి ఈ నెల 20 వరకూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతా నిర్వహించనున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కోనసీమ జిల్లాలో 5,800, కాకినాడ జిల్లాలో 6,500, తూర్పుగోదావరి జిల్లాలో 5,700 బోధకులు పని చేస్తున్నారు. వీరు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తూనే ఉన్నాయి. అయినా స్పందన లేక ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రధానంగా 12వ పీఆర్సీని అమలు చేసే లోపు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని, కరోనా సమయంలో మరణించిన ఉద్యోగ ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేసి ఉపాధ్యాయులకు డిప్యూటీ డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వానికి ఉపాధ్యాయులు అనేక సార్లు విన్నవించారు. ఆ మేరకు వివిధ సంఘాల ద్వారా వినతి పత్రాలను అందజేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
శ్రీరణభేరి జాతాశ్రీ ఎక్కడెక్కడంటే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఉపాధ్యాయుల సమస్యపై కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆందోళనకు దిగుతున్నామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు ప్రకటించారు. పాఠశాల విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా సోమవారం నుంచి 20 వరకూ సాగే జాతా ద్వారా ఉపాధ్యాయులు, ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. 15న కాకినాడ జిల్లా, 16న అల్లూరి సీతారామరాజు మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో, 17న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, 18న పశ్చిమ గోదావరి, 19న ఏలూరు జిల్లాల్లో జాతా సాగుతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జాతాలతో పాటు ఉత్తరాంధ్రలో ఒకటి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటి, తూర్పు రాయలసీమలో ఒకటి, పశ్చిమ రాయలసీమలో ఒకటి కలపి మొత్తం ఐదు జాతాలు తిరుగుతాయన్నారు. చివరిగా ఈ నెల 25న విజయవాడలో భారీ బహిరంగ సభ ద్వారా కూటమి ప్రభుత్వంపై డిమాండ్ల సాధన కోసం ఒత్తిడి తీసుకొస్తామని యూటీఎఫ్ నాయకులు చెబుతున్నారు.
విన్నపాలు వినలే..
తమ సమస్యలు పట్టించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు అనేక సార్లు ఉద్యమించారు. ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 5 వరకూ నిరసన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ 2న తమకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలు చేశారు. ఈ ఏడాది ఆగస్ట్ 2న కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట యాప్‌ల భారం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులకు వివిధ రకాలుగా రూ.25 వేల కోట్ల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయినా పట్టించుకోక పోవడంతో జాతాకు కార్యచరణ చేశారు.
భాగస్వాములు కావాలి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రణభేరి జాతాను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలనే సామాజిక బాధ్యతతో జాతాతో ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించాం. ఈ జాతాలో ఉపాధ్యాయులంతా భాగస్వాములు కావాలి.
–పి.సురేంద్ర, యూటీఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు
బోధన.. అవస్థల మాటున
విద్యార్థులకు విద్యాబుద్ధులను చెప్పే పనిని చేయనీయకుండా కూటమి ప్రభుత్వం తమ ప్రచార యావను గురువులపై రుద్దుతోంది. మెగా పీటీఎం 2.0 పేరుతో జూలై 10న నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌ను తల్లికి వందనం పథకం ప్రచార కార్యక్రమంగా నిర్వహించింది. ఏడాది ఎగ్గొట్టి అరకొరగా మాత్రమే ఇచ్చిన సాయానికి అంత ప్రచారం అవసరమా అనే వాదన అందరిలో వినిపించింది. కార్యక్రమం నిర్వహణకు 17 కమిటీలు వేసి పండగలా నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలు ఒత్తిడికి గురిచేసింది. బోధనేతర పనుల నుంచి టీచర్లను మినహాయించాలని కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. పీ–4 నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలన్న డిమాండ్‌ను ఉద్యమంతో సాధించుకున్నారు. యాప్‌ల భారం తగ్గించాలని కోరగా, పని భారాన్ని ఏమాత్రమూ తగ్గించకుండా చేశామన్న పేరుకు ప్రభుత్వం అన్ని యాప్‌లను ఒకే వేదికకు మాత్రమే చేర్చింది.
ప్రశ్నించే ఆయుధం నిర్వీర్యం
ప్రజాస్వామ్య పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయంలోకి ఇతరులు ప్రవేశించరాదంటూ అప్రజాస్వామిక జీఓను జారీ చేసింది. ప్రభుత్వ జీఓ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ఆయుధాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుందని విద్యార్థి సంఘాలు నేతలు అంటున్నారు. పాఠశాలల్లో అసౌకర్యాలు ఉన్నా ఎవరూ అడగకుండా ఉండాలనేది ప్రభుత్వ ముఖ్యోద్దేశంగా ఉందని విమర్శిస్తున్నారు.
గుణపాఠం చెప్పాలని..