
సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
నిజాలు భరించలేకే జులుం చూపిస్తున్నారు
ప్రభుత్వ పరంగా జరుగుతున్న తప్పొప్పులను ప్రజలకు నిర్భయంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్న సాక్షి పత్రిక, పత్రిక సంపాదకుడు ఆర్.ధనుంజయరెడ్డిపై కూటమి కక్ష కట్టింది. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని మరచి, నిజాలు వెల్లడిస్తున్న పత్రికల మీద కేసులు పెట్టడం హేయమైన చర్య. పాలకులకు, ప్రజలకు వారధులుగా నిలిచి, ప్రగతికి తోడ్పడే పత్రికలపై కక్ష సాధింపునకు దిగడం పాలకుల పిరికితనానికి నిదర్శనం.
– జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, రాజానగరం
అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం
అక్రమ కేసులతో శ్రీసాక్షిశ్రీ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య. గతంలో ఎప్పుడూ ఇలాంటి విష సంస్కృతి లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించడమే నేరమా? శ్రీసాక్షిశ్రీ మీడియాపై అక్రమ కేసులు పెడుతూ గొంతు నొక్కాలని చూడడం సరికారు. దీనిని అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికై నా ఈ చర్యలను ప్రభుత్వం విడనాడాలి. –పాముల రాజేశ్వరీదేవి, మాజీ ఎమ్మెల్యే

సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025