
మళ్లీ పెరుగుతున్న వరద
పి.గన్నవరం: గోదావరి ఎగువ ప్రాంతాల వస్తున్న వరద నీటితో జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమీ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ వరద రావడంతో లంక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు వచ్చిన వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన చెందుతున్నారు. నాలుగో సారి వరద రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రెండు నెలలుగా పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. వరద ఉధృతి పెరగడంతో పడవలు దాటే సమయంలో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.