
లోక్ అదాలత్‌లో 377 కేసుల పరిష్కారం
అమలాపురం టౌన్: స్థానిక కోర్టుల భవనాల సముదాయంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 377 కేసులు పరిష్కారమయ్యాయి. అమలాపురం రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పి.గోవర్ధన్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరిగింది. 13 సివిల్ కేసులు, 311 క్రిమినల్, 20 వాహన ప్రమాద, 21 బీఎస్‌ఎన్‌ఎల్, 12 బ్యాంక్ కేసులతో కలపి మొత్తం 377 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.2,37,18,700 విలువైన కేసులు పరిష్కారమైనట్లు కోర్టు కార్యాలయం తెలిపింది. లోక్ అదాలత్‌లో సివిల్ జడ్జి పి.రమణారెడ్డి (సీనియర్ డివిజన్), ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎండీ రహమతుల్లా (జూనియర్ డివిజన్)తో పాటు అదాలత్ సభ్యులు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.