
ఐఎండీ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన
అమలాపురం రూరల్: జిల్లా ప్రజలు ప్రకృతి వైపరీత్యాల నుంచి జాగ్రత్త పడేందుకు వీలుగా భారత వాతావరణశాఖ (ఐఎండీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యోచన చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం భారత వాతావరణశాఖ అధికారులు భట్నవెల్లిలోని ఒనువులమ్మ దేవాలయం వద్ద సేకరించిన 50 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఓండీ కార్యాలయం ఏర్పాటుకు 50 సెంట్లు స్థలం అనువుగా ఉందని అధికారులు అభిప్రాయ పడ్డారన్నారు. ఈ కార్యాలయం ఏర్పాటు వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలు అందుతాయన్నారు. తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా అప్రమత్తం కావచ్చన్నారు. వర్షం, ఎండ, చలి, తుపానులు, వడగండ్ల వాన, భూకంపాల వంటి వాటికి ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.