
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా తులసీ కుమార్
పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు) నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జెడ్పీటీసీ గుబ్బల తులసీ కుమార్‌ను అనపర్తి నియోజకవర్గానికి నియమించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.