
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రావులపాలెం: స్థానిక అమలాపురం రోడ్డులోని కాలువ గట్టు వద్ద శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. సీఐ శేఖర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక హైస్కూల్ దాటిన తర్వాత రోడ్డు పక్కనే కాలువ చెంత 35 నుంచి 40 ఏళ్ల వయసున్న పురుషుడి మృతదేహం ఉంది. అతడి ఒంటిపై చారల టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.