
సాయమందజేసీ
అమలాపురం రూరల్: ఉద్యోగం పేరుతో మోసానికి గురై, చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న దివ్యాంగుడు, అతడి కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ నిషాంతి రక్షించారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన నాగేశ్వరరావు అనే దివ్యాంగుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శంకర్రావు అనే వ్యక్తి నమ్మించాడు. చైన్నెలో ఉద్యోగం ఉందంటూ చెప్పి నాగేశ్వరరావు, అతడి భార్య, పిల్లలను తీసుకువెళ్లాడు. చైన్నెలోని సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత, వారి దగ్గర ఉన్న డబ్బులను తీసుకుని పరారయ్యాడు. వెంటనే నాగేశ్వరరావు.. జేసీ నిషాంతికి ఫోన్ చేసి, తన పరిస్థితిని వివరించాడు. భార్యాపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన జేసీ.. వెంటనే చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆర్‌పీఎఫ్ సిబ్బందితో మాట్లాడి, నాగేశ్వరరావు కుటుంబానికి రైలు టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేయించారు. ఖర్చు కోసం తన సొంత డబ్బును పంపించి ఆ కుటుంబాన్ని రక్షించారు.
● ఉద్యోగం పేరుతో మోసపోయిన దివ్యాంగుడు
● భార్యాపిల్లలతో సహా చైన్నెలో చిక్కుకున్న వైనం
● రక్షించిన జాయింట్ కలెక్టర్ నిషాంతి