
వందే భారత్ ఢీకొని వృద్ధురాలి మృతి
నిడదవోలు: పట్టాలు దాటుతున్న వృద్ధురాలిని వందే భారత్ రైలు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. నిడదవోలు రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం, తాడేపల్లిగూడెం మండలం తెలికిచర్ల గ్రామానికి చెందిన రేకపల్లి సీతమ్మ(65) నిడదవోలులోని కంటి ఆస్పత్రికి వెళ్లేందుకు సోమవారం ఉదయం బయలుదేరింది. బసివిరెడ్డిపేట–ఇందిరానగర్ మధ్య రైలు పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే వందే భారత్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.