
వంటకు కొబ్బరి నూనె శ్రేష్ఠం
కొబ్బరి నూనె ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శక్తి పెరిగి, చర్మానికి తేమ అందుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హార్మోన్ల స్థాయిలను స్థిరంగా ఉంచి, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెను తలకు పట్టించి.. మర్దన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.