
విద్యార్థిని అదృశ్యం
రంగంపేట: కళాశాలకంటూ వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైనట్టు కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై శివప్రససాద్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, రాజానగరం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల నూతలపాటి షెలాశియా రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే శనివారం దివాన్‌చెరువులో ఆర్టీసీ బస్సు ఎక్కి, రంగంపేటలో దిగి కళాశాలకు వెళ్లింది. కళాశాల ముగిశాక సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు తెలిసిన చోట్లా, బంధువుల ఇళ్ల వద్దా ఆచూకీ కోసం యత్నించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో.. శనివారం రాత్రి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. విద్యార్థిని ఆచూకీ తెలిసిన వారు రంగంపేట పోలీస్ స్టేషన్‌కు, లేదా 94409 04854, 94407 96538 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.