సమయపాలన ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

సమయపాలన ముఖ్యం

Aug 6 2025 6:24 AM | Updated on Aug 6 2025 6:24 AM

సమయపా

సమయపాలన ముఖ్యం

అంగన్‌వాడీ

కార్యకర్తలకు బకాయిలు

అంగన్‌వాడీ కార్యకర్తలకు మార్చి నుంచి ఈవెంట్స్‌ బిల్లులు బకాయి పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక టీఏ, డీఏలు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఇటీవల గౌరవ వేతనాలు మాత్రం జమ చేసింది. మరోవైపు యాప్‌ యాతనలు పడలేమంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు రెండు రోజులుగా మొబైల్‌ ఫోన్లను ప్రభుత్వాధికారులకు వెనక్కి ఇచ్చేస్తున్నారు.

క్లాప్‌ మిత్రలు,

పారిశుధ్య కార్మికులు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అమలులో భాగంగా తడి, పొడి చెత్త సేకరించేందుకు 250 కుటుంబాలకు ఒకరు చొప్పున క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) మిత్రలను తీసుకున్నారు. గత ఏడాది నుంచి తమ జీతాల నుంచి పీఎఫ్‌, ఈఎస్‌ఐలకు నగదు మినహాయించినప్పటికీ సుమారు రూ.50 లక్షలు జమ చేయలేదని క్లాప్‌ వాహన డ్రైవర్ల సంఘం ఆరోపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల్లో ఉన్న సంపద సృష్టి కేంద్రాల్లో క్లాప్‌మిత్రలు రూ.6 వేల జీతానికి పని చేస్తున్నారు. తర్వాతి కాలంలో మిషన్‌ నుంచి నిధులు నిలిచిపోవడంతో వీరి జీతాల భారం పంచాయతీలపై పడింది. పంచాయతీల ఆర్థిక పరిస్థితులు బాగోలేక వీరి జీతాలు బకాయిలు పేరుకుపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక పంచాయతీల్లో గ్రీన్‌ అంబాసిడర్స్‌ (పారిశుధ్య కార్మికుల)కు 3 నెలలకు పైగా గౌరవ వేతనాలు బకాయిలున్నాయి.

కపిలేశ్వరపురం: ప్రభుత్వమంటే సామాన్య ప్రజలకు, వారికి సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులు, సేవకులకూ భరోసా ఇచ్చేదిగా ఉండాలి. గెలవాలన్న తపనతో నోటికొచ్చిన హామీలిచ్చేసి, గెలిచాక ఆర్థిక సంక్షోభమంటూ లెక్కలేసుకోవడం ప్రజాస్వామ్యయుతమైన పాలన కానేకాదు. 2024 జూన్‌ 12న అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం పాలన సామాన్యులు, చిరుద్యోగులను తీవ్ర యాతనకు గురి చేస్తోంది. వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంటూ వాటిని ఎగవేస్తోంది. వేతనాలు ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగులు కాదంటూ కోతలు పెడుతోంది. ఇచ్చేది స్వల్ప వేతనమే అయినా దానిని కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో వివిధ శాఖల్లో పని చేస్తున్న చిరుద్యోగులు నానా అగచాట్లూ పడుతున్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే పేరుతో నేరుగా ప్రజలకు ఫోన్‌ చేసి సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా అని అడుగుతున్న ప్రభుత్వం.. సిబ్బందికి భారీగా బకాయిలపై మాత్రం నోరు మెదపడం లేదు.

అత్యవసర సేవకులకు అవస్థలు

అత్యవసర సేవలందించే 108, 104, 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను గతంలో అరబిందో సంస్థ నిర్వహించేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భవ్య హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ మార్పు క్రమంలో రెండు నెలల పాటు వేతనం, ఇంక్రిమెంట్లు ఆలస్యంగా అందజేశారు. వీరి వేతనాన్ని రూ.4 వేలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఆచరణకు వచ్చేసరికి 108 సిబ్బందికి రూ.500, 104 సిబ్బందికి రూ.1,500 తగ్గించి వేతనాలిస్తున్నారు. వాహనం బ్రేక్‌డౌన్‌ అయ్యినప్పుడు ఉద్యోగికి వేతనం తగ్గిస్తూనే సేవలు మాత్రం కొనసాగించినట్టు చూపుతున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు బకాయి పెట్టారు.

‘డొక్క’లెండుతున్నాయ్‌

మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రా అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పెట్టామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం.. ఆ పథకం నిర్వాహకులను మాత్రం అనేక అవస్థలకు గురి చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,258 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 229 ఉన్నత పాఠశాలల్లో 62,464 మంది, కాకినాడ జిల్లాలో 1,285 ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అప్పులు చేసి అన్నం పెడుతున్నారు. ప్రతి విద్యార్థికి మెనూ చార్జి కింద రూ.20 ఇవ్వాలని, వంట గ్యాస్‌ సిలిండర్‌, కూరగాయలను ప్రభుత్వమే ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి. వారికి ఇచ్చే రూ.3 వేల వేతనాన్ని కూడా రెండు నెలలకోసారి అందజేస్తున్నారు. మెనూ చార్జి బిల్లులను మార్చి నుంచి బకాయి పెట్టింది. పథకం నిర్వహణను ప్రైవేటు వారికి అప్పజెప్పిన ప్రాంతాల్లో కార్మికులకు రూ.3 వేలు కాకుండా రూ.1,500 మాత్రమే ఇస్తున్నారు. రౌతులపూడి, తుని, శంఖవరం, కోటనందూరు, తొండంగి, గొల్లప్రోలు తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

స్కూల్‌ ఆయాలకు ఆరు నెలలుగా..

పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న ఆయాకు నెలకు కేవలం రూ.6 వేల గౌరవ వేతనమిస్తున్నారు. అది కూడా జనవరి నుంచి ఆరు నెలల పాటు బకాయి పెట్టారు. పాఠశాలకు ఒక్కరు చొప్పున కాకుండా పాఠశాల విస్తీర్ణం ప్రామాణికంగా ఆయాలను తీసుకోవాలని సంఘం కోరుతోంది.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎరియర్స్‌, డీఏలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్ల రూపాల్లో రూ.కోట్లలో బకాయిలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇటీవల బదిలీ అయిన 1,500 మంది ఉపాధ్యాయులకు జూన్‌, జూలై నెలల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. స్కూల్‌ అసిస్టెంట్‌ సమాన క్యాడర్‌ బదిలీలు జూన్‌ 9తో, ఎస్జీటీ బదిలీలు జూన్‌ 14తో ముగిసినప్పటికీ సాంకేతిక సమస్యల సాకుతో వేతనాలు చెల్లించడం లేదు. డీఎస్సీ–98 మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులు ఆందోళనలు చేసిన అనంతరం జూన్‌ నెల వేతనాన్ని ఇటీవల అందుకున్నారు.

ఇంకా..

సీఎంఆర్‌ ద్వారా రైతులు అమ్మిన రబీ ధాన్యానికి సైతం ప్రభుత్వం ఇంకా డబ్బు చెల్లించలేదు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ జూలై 7న అమలాపురం కలెక్టరేట్‌ వద్ద కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. పవన్‌ కల్యాణ్‌ పల్లె పండగ పేరుతో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.170 కోట్ల పనులు చేయించగా ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని వారు నిరసన తెలిపారు.

బాంబింగ్‌ను

అడ్డుకున్న గ్రామస్తులు

మామిడికుదురు: పాశర్లపూడి–పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులో ఓఎన్‌జీసీ క్షేత్రంలో డ్రిల్లింగ్‌ నిర్వహిస్తున్న సైటులో మంగళవారం బాంబింగ్‌ నిర్వహించారు. బాంబుల శబ్ధానికి తమ ఇళ్లు బీటలు తీశాయంటూ స్థానిక శ్రీరామ్‌పేటవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గ్రామ సర్పంచ్‌ కొనుకు ప్రేమజ్యోతి, మాజీ సర్పంచ్‌ కొనుకు నాగరాజు దృష్టికి తీసుకు వెళ్లారు. మాజీ సర్పంచ్‌ అక్కడకు చేరుకుని ఓఎన్‌జీసీ అధికారులతో మాట్లాడారు. ముందస్తుగా ఏవిధమైన సమాచారం లేకుండా బాంబింగ్‌ ఎందుకు చేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో ఓఎన్‌జీసీ అధికారులు బాంబింగ్‌ను నిలుపుదల చేశారు. ఈ–2003 నంబర్‌ రిగ్‌తో ఇక్కడ డ్రిల్లింగ్‌ నిర్వహించారు. డ్రిల్లింగ్‌ చివరి దశకు చేరుకున్న సమయంలో గత నెల 9వ తేదీన భారీ శబ్ధంతో గ్యాస్‌ కిక్‌ ఇచ్చింది. దీంతో అయోమయానికి గురైన ఓఎన్‌జీసీ సిబ్బంది పరుగులు తీశారు. స్థానికుల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాంబింగ్‌ నిర్వహించడంతో స్థానికులు భయపడ్డారు. ఎమ్మార్వో సునీల్‌కుమార్‌ను వివరణ కోరగా తమకు ఏ విధమైన సమాచారం లేదన్నారు. దీనిపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు.

అమలాపురం రూరల్‌: జలవనరుల శాఖ ఇంజినీర్లు ముఖ ఆధారిత హాజరు నమోదుతో పాటు సమయపాలన పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వీడియో కాన్ఫరెనన్స్‌ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు జలవనరులు, డ్రైనేజీ విభాగపు ఇంజినీర్ల పనితీరుపై ఈఈ, డీఈ ఈ, సహా ఇంజినీర్లతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో జలవనులశాఖ పనులలో ఆశించిన పురోగతి లేదని ఉన్నతాధికారుల సమీక్షలో వెల్లడైన నేపథ్యంలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. డీఆర్‌ఓ కె.మాధవి ఆర్డీవోలు పి.శ్రీకర్‌, డి.అఖిల, ఎస్‌ఈ వెంకట స్వామి, డీఈలు వెంకటేశ్వరరావు డ్రైనేజీ విభాగం ఈఈ ఎంవీవీ కిషోర్‌ పాల్గొన్నారు.

అంతర్వేది ఆలయ భూముల

రీ సర్వే పూర్తి చేయాలి

అంతర్వేది లక్ష్మినరసింహ స్వామి దేవస్థాన భూముల రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, దేవదాయ, ధర్మాదాయ అధికారులను జేసీ నిషాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో దేవస్థాన భూముల సర్వేపై సమీక్షిస్తూ 895 ఎకరాలలో 139 ఎకరాలు దేవస్థానం అధీనంలోనే ఉందని, ఇప్పటివరకు 211 ఎకరాలలో సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. నోటీసులు ఇచ్చి 15 రోజులలో ఆక్రమణదారులను ఖాళీ చేయించాలన్నారు. దేవస్థానం కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి భూములకు అద్దెలు, లీజుల ధరలు నిర్ణయించాలన్నారు.

నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు

అయినవిల్లి లో వేంచేసియున్న వరసిద్ధి వినాయక స్వామి ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చతుర్థి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేయాలని జేసీ నిషాంతి దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఉత్సవాల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. సెప్టెంబర్‌ 4 వరకు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వ హించాలన్నారు.

వేతనాల చెల్లింపు భారం అనుకోవడం సరికాదు

మానవ సమాజంలో సంపదను సృష్టించేది మానసిక, శారీరక శ్రమ చేసే శ్రామికులే. వారికి వేతనాలు రూపంలో ఖర్చు చేసేది భారంగా ప్రభుత్వం భావించకూడదు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే స్థాయిలో వేతనాలను పెంచి , క్రమం తప్పకుండా చెల్లించాలి.

– చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, కాకినాడ జిల్లా

ఉమ్మడి జిల్లాలో

చిరుద్యోగులకు వేతన వెతలు

వేతన, బిల్లుల బకాయిలతో అవస్థలు

అత్యవసర సిబ్బందికీ సమస్యలే

ఉద్యోగ ఉపాధ్యాయులూ బాధితులే

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు

ఫోన్‌లను తిరిగి ఇచ్చేస్తున్న

అంగన్‌వాడీలు

సమయపాలన ముఖ్యం1
1/3

సమయపాలన ముఖ్యం

సమయపాలన ముఖ్యం2
2/3

సమయపాలన ముఖ్యం

సమయపాలన ముఖ్యం3
3/3

సమయపాలన ముఖ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement