
మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీత
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఈ నియామకం చేపట్టారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇళ్ల స్థలాలకు
జర్నలిస్టుల వినతి
అమలాపురం రూరల్: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏపీయుడబ్ల్యూజే శాఖ అధ్వర్యంలో అమలాపురంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మండేల నాగప్రసాద్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ సమస్యలపై ఆందోళన చేశారు. బిహార్ తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్‌లో చనిపోయిన పాత్రికేయులకు ఆర్ధిక సాయం అందించాలని, జర్నలిస్టులు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కోర్లపాటి ప్రదీప్, ఉమ్మడి తూర్పుగోదావరి మాజీ కార్యదర్శి సుంకరప్రసాద్, ప్రెస్‌క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షుడు కొండేపూడి సత్య నారాయణ, మాజీ అధ్యక్షుడు రంబాల నాగ సత్య నారాయణ, అమలాపురం నియోజకవర్గ ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు అరిగెల రుద్ర శ్రీనివాస్‌రావు, నాయకులు నిమ్మకాయల సతీష్‌బాబు, పరసా సుబ్బారావు, పొట్టుపోతు నాగు, వట్టి కూటి గోవింద్, ఆకుల రవితేజ, దొమ్మేటి వెంకట్, కాకిలేటి సూరిబాబు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర కోకో రైతుల సదస్సు
అంబాజీపేట: ఏపీ రాష్ట్ర కోకో రైతు సదస్సును బుధవారం మధ్యాహ్నం అంబాజీపేట కోప్రా మర్చంట్ హాల్‌లో నిర్వహించనున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోకో రైతు సంఘ నాయకులు తెలిపారు. ఈ సదస్సులో కోకో రైతులు ధరల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఎఫ్‌పీఓలు ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తారన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన
అమలాపురం టౌన్: జిల్లాలో చాలా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ (అముడా) చైర్మన్ అల్లాడ స్వామినాయుడు ఆ లే అవుట్ల యాజమానులకు సూచించారు. ఇందుకు అనధికార లే అవుట్ల క్రమబద్ధీరణ స్కీమ్‌ను (ఎల్‌ఆర్‌ఎస్) జిల్లాలోని రియల్టర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
స్థానిక అముడా కార్యాలయంలో జిల్లాలోని లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఇంజినీర్లతో అనధికార లేవుట్లపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్ స్వామినాయుడు మాట్లాడారు. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు తుది గడువు వచ్చే అక్టోబర్ 24వ తేదీ అన్నారు. అనధికార లే అవుట్లలో ప్లాట్‌లు కొనుగోలు చేసినవారు కూడా ఎస్‌ఆర్‌ఎస్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అముడా ప్లానింగ్ ఆఫీసర్ ఎ.సత్యమూర్తి ఎస్‌ఆర్‌ఎస్ స్కీమ్‌పై, దానికి విధించిన తుది గడువు. దరఖాస్తులు చేసుకునే విధి విధానాలపై సర్వేయర్లు, ఇంజినీర్లకు అవగాహన కల్పించారు. అముడా అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి పి.ఉమా మహేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిట్టిబాబు ఎల్‌ఆర్‌ఎస్ నియమ నిబంధనలు వివరించారు.

మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీత

మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీత