
నేడు ఆర్టీసీ ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే
అమలాపురం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల మూడో శుక్రవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తునట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్‌టీపీ రాఘవకుమార్ తెలిపారు. జిల్లాలోని అమలాపురం, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు డిపోల్లోని తమ రవాణా కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆర్టీసీలో వివిధ విభాగాల ఉద్యోగులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించి పరిష్కరించుకోవాలని రాఘవకుమార్ కోరారు.