ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని ఆవిష్కరిద్దాం.. | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని ఆవిష్కరిద్దాం..

Jul 20 2025 5:36 AM | Updated on Jul 20 2025 5:36 AM

ప్లాస

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని ఆవిష్కరిద్దాం..

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ పిలుపు

అమలాపురం టౌన్‌: ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని ఆవిష్కరిద్దామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. స్వచ్ఛ స్వర్ణాంధ్రలో భాగంగా స్థానిక రైతు బజార్‌ను శనివారం ఆయన సందర్శించి అక్కడ ప్లాస్టిక్‌ నియంత్రణ చర్యలను పరిశీలించారు. రైతు బజారులో పలు కూరగాయల దుకాణాల వద్ద రైతులతో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణపై ఆయన ఆరా తీశారు. ప్లాస్టిక్‌ కాలుష్యం అంతం అనే కొత్త ఇతివృత్తంతో ప్రజల్లో అవగాహన పెంచాలని రైతుబజార్‌ అధికారులను ఆదేశించారు. ఇక్కడ ప్లాస్టిక్‌ నివారణలో భాగంగా జ్యూట్‌, కాగితపు సంచులు విక్ర యించే దుకాణాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆ దు కాణాన్ని నిర్వహిస్తున్న మహిళతో కలెక్టర్‌ మాట్లాడారు. రైతు బజార్‌కు కూరగాయలకు వచ్చే వినినియోగదారులు సంచులు తీసుకు రాకపోతే మీ దుకాణంలో జ్యూట్‌, కాగితపు సంచులు కొంటు న్నారా...? అని కలెక్టర్‌ ఆరా తీశారు. జిల్లా మా ర్కెటింగ్‌ శాఖ అధికారి కె.విశాలాక్షి రైతు బజా రుల్లో సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌కుమార్‌, రైతు బజార్‌ ఎస్టేట్‌ అధికారి సుబ్బారావు, అమలాపురం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు పాల్గొన్నారు.

స్వామిని చూడగ..

మది మురవగ

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏడుకొండల వాడా, వెంకటరమణా గోవిందా, గోవింద అంటూ ఆ స్వామి వారిని కొలిచారు. సుప్రభాత సేవ అనంతరం తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలి హారతిని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపించారు. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. నవీన ఆలయంతో పాటు పాత గుడి వద్ద స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,21,626 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామివారిని 3,800 మంది దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.

నేటి నుంచి అధ్యయనోత్సవాలు

శ్రీబాల బాలాజీ స్వామివారి నూతన దేవాలయంలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. ఉదయం, సాయంత్రం కె.కృష్ణమాచార్యులు, ఎస్‌టీపీ రామానుజాచార్యులు, సీవీఎస్‌ సాయిరామ్‌, ఎస్‌.వెంకటాచార్యులు సేవాకాలం నిర్వహిస్తారన్నారు. 24న సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణల కార్యక్రమం ఆలయ ఉప ముఖ్య అర్చక స్వామి శ్రీమాన్‌ గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

శృంగార వల్లభుని

ఆలయంలో రద్దీ

పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రా మంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నా రు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయ ణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,50,679 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. సుమారు 3 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని  ఆవిష్కరిద్దాం.. 1
1/2

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని ఆవిష్కరిద్దాం..

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని  ఆవిష్కరిద్దాం.. 2
2/2

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని ఆవిష్కరిద్దాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement