బీమా.. భారమే! | - | Sakshi
Sakshi News home page

బీమా.. భారమే!

Jul 13 2025 7:42 AM | Updated on Jul 13 2025 7:42 AM

బీమా.

బీమా.. భారమే!

వరినాట్లు వేస్తున్న రైతు కూలీలు

ప్రకృతి వైపరీత్యాలకు తీవ్రంగా దెబ్బతిన్న వరిపంటను చూపుతున్న అన్నదాత (ఫైల్‌)

అన్నదాతను ముంచిన కూటమి ప్రభుత్వం

ఎకరాకు రూ.769 ప్రీమియం పిడుగు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

రైతు సంక్షేమమే ధ్యేయంగా చర్యలు

ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభమైనా సకాలంలో విత్తనాలు, ఎరువులను సరఫరా చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం అన్నదాతపై మరో పిడుగు పడేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌ భీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) ప్రీమియం భారాన్ని గత వైఎస్సార్‌ సీపీ చెల్లించి అన్నదాతను ఆదుకుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందించకపోగా వివిధ పథకాలను రద్దు చేసి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు చెల్లిస్తామన్న హామీ ఏడాది పూర్తయినా ఇంకా అమలుకు నోచుకోలేదు. ధాన్యం సొమ్ములను సకాలంలో విడుదల చేయపోవడంతో రైతులు అప్పులు తెచ్చి ఖరీఫ్‌ సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 1.64 లక్షల ఎకరాల్లో సుమారు 1.06 లక్షల మంది వరి సాగుచేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ పనులు జోరుగా సాగుతున్నా ఫసల్‌ బీమాపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంపై పంటల బీమా ప్రీమియంను రైతులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌కు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమా వర్తించదని వ్యవసాయశాఖ చెబుతుండటంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రీమియం భారం రూ.12.45 కోట్లు

రైతులను ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2016లో ఫసల్‌ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.769 ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. అయితే 2019 రబీ పూర్తయ్యే వరకూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉచిత పంటల భీమాను అమలు చేయకుండా రైతులపై ప్రీమియం భారం వేసింది. 2019 మే 30న అధికార బాధ్యతలు చేపట్టిన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుచూపుతో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం ఫసల్‌ బీమా ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకుని లక్షలాది మంది రైతులకు ఆసరాగా నిలిచింది. కూటమి ప్రభుత్వం నేటికీ స్పందించకపోవడంతో ప్రతి సీజన్‌కు రూ.12.45 కోట్లు ప్రీమియం చెల్లింపుల భారం అన్నదాతపై వేస్తోంది.

బీమాతో ప్రయోజనాలెన్నో

ప్రధానమంత్రి ఫసల్‌ యోజన ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. వాతావరణ పరిస్థితు ల ప్రభావంతో తుపానులు, వరదలు వంటి ప్రకృతి వై పరీత్యాలు సంభవించినప్పుడు పంటకు నష్టం వాటిల్లి తే సత్వరమే రైతులకు నష్ట పరిహారం లభిస్తుంది. రైతు నష్టపోతే వ్యవసాయశాఖ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తే 72 గంటల లోపు సంబంఽధిత బీమా సంస్థ స్పందించి పరిహారం మంజూరు చే స్తుంది. జిల్లాలో కొంతమంది రైతులు బ్యాంకులు, సొ సైటీల ద్వారా రుణాలు తీసుకున్న రైతుల నుంచి ప్రీ మియం సొమ్మును మినహాయించుకుని మిగిలిన సొ మ్మును రైతు ఖాతాలో జమ చేస్తారు. అలాగే రుణాలు తీసుకోని రైతులతో పాటు కౌలు రైతులు ఫసల్‌ బీమా చెల్లించకుంటే పరిహారం అందే అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం సుమారు 60 లక్షల మంది మాత్రమే పంట రుణాలు తీసుకుని ప్రీమియం చెల్లించారు. మిగతా రైతులు మాత్రం సొంతంగా పంటల బీమా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

బీమా లేకుంటే దక్కదు ధీమా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లకు ఉచిత పంటల బీమా వర్తింపజేయలేదు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదు. ఈ ఏడాది వర్షాలు, తుపానులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రీమియం చెల్లించని రైతులకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక్క రూపాయి కూడా మంజూరు కానందున సత్వరమే రైతులందరూ ప్రీమియం చెల్లించి పంటలను కాపాడుకోవాలని వ్యవసాయశాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఇక ఉచిత పంటల బీమా అమలు చేయదని ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందేనని రైతులు ఒక అభిప్రాయానికి వచ్చారు. దీంతో ప్రతి రైతుకు ఎకరాకు రూ.769 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉచిత బీమా అమలు చేయాల్సిందే

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మా దిరిగా ఉచిత పంటల బీమా అమ లు చేసి రైతులను కూటమి ప్రభు త్వం ఆదుకోవాలి. వ్యవసాయం చేయడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రీమియం భారాన్ని రైతులను భరించమనడం సరికాదు. దీని పై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలి. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులపై తీవ్రమైన భారం పడుతోంది.

– గుణ్ణం రాంబాబు, రైతు,

సర్పంచ్‌ గుమ్మిలేరు, ఆలమూరు మండలం

కౌలు రైతులకు పెనుభారం

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంట బీమా అమలు చేయకపోవడం వల్ల కౌలురైతులపై పెనుభారం పడుతోంది. రైతుకు ఎకరాకు రూ.769 భారం వేయడం సరికాదు. వరి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు భారం వేయడం సరికాదు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు ఒక పైసా ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తించింది.

– కోట బూరయ్య, రైతు

బీమా.. భారమే!1
1/1

బీమా.. భారమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement