
కూటమి ప్రభుత్వ మోసాలపై గర్జిద్దాం..
ముమ్మిడివరం: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన మోసాలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కోదమ సింహాలై గర్జించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. ముమ్మిడివరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అఽతిథిగా విచ్చేసి మాట్లాడారు. తొలిత సభా వేదిక వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగ్గిరెడ్డితోపాటు నియోజకవర్గ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై నియోజకవర్గంలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై జగ్గిరెడ్డి షెడ్యూల్‌ను వివరించారు. నిరసన కార్యక్రమాలను గ్రామ, మండల స్థాయిల్లో విజయవంతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు అనేక హామీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు పూర్తిలో న్యాయం జరిగిందని అన్నారు. పార్టీ కార్యకర్తలకు సుముచిత స్థానం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలపై జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో పోరాటం చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పథకాలను పక్కనబెట్టి, అభివృద్ధిని విస్మరించిందన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, నియోజకవర్గ పరిశీలకుడు మాతా మురళి, డిల్లీ నారాయణ, పెయ్యల చిట్టిబాబు, కాశి బాలమునికుమారి, నల్లా నరసింహమూర్తి, కుడుపూడి శంకరరావు, కాదా గోవిందకుమార్, రాయపురరెడ్డి జానకిరామయ్య, కమిడి ప్రవీణ్‌కుమార్, కాశి రామకృష్ణ, పిన్నమరాజు వెంకట పతిరాజు, పెన్మత్స చిట్టిరాజు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో దొమ్మేటి శామ్యూల్ సాగర్, నేల కిశోర్, ముదునూరి సతీష్‌రాజు, కోలా బాబ్జీ, జగతా పద్మనాభం, నడింపల్లి సూరిబాబు, బొంతు బుజ్జిబాబు, చింతలపాటి శ్రీనురాజు, కాశి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు

కూటమి ప్రభుత్వ మోసాలపై గర్జిద్దాం..