బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల ధర్నా | - | Sakshi
Sakshi News home page

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల ధర్నా

Jul 8 2025 7:08 AM | Updated on Jul 8 2025 7:08 AM

బిల్ల

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల ధర్నా

అమలాపురం రూరల్‌: తమకు బిల్లులు చెల్లించనందుకు నిరసనగా జిల్లా కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ అధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మూడు సంవత్సరాలుగా 15 ఆర్థిక సంఘానికి సంబంధించిన బిల్లులు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పల్లె పండగ పేరుతో ఎన్‌ ఆర్‌జీ ఎస్‌ నిధులతో రూ.170 కోట్లు పనులు చేయించారని తెలిపారు. కనీసం జీఎస్టీ కూడా ఇవ్వలేదన్నారు. డిప్యూటీ సీఎం చెప్పారని చిన్నచిన్న కాంట్రాక్టర్లు అందరూ కలిసి పనులు చేశామని, వారం వారం పేమెంట్‌ ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఏడు నెలలు జరిగినా బిల్లులు ఇవ్వలేదని చెప్పారు.

అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కలెక్టర్‌కు సంఘ నాయకులు అల్లాడ వెంకటరమణ, రాయపురెడ్డి శ్రీనివాసరావు, అడ్డగళ్ల సాయిరామ్‌, గంధం బ్రహ్మనందం వినతిపత్రం అందించారు.

10న మెగా పీటీఎం

అమలాపురం రూరల్‌: కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్‌, ఎయిడెడ్‌ యాజమాన్యాలలోని పాఠశాలు, జూనియర్‌ కళాశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం)ను సమర్థంగా నిర్వహించాలని నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులను కలెక్టర్‌ ఆర్‌ మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఎంఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మెగా తల్లి దండ్రులు ఉపాధ్యాయుల సమావేశ నిర్వహణ విధివిధానాలను వివరించి సన్నద్ధత చర్యలపై ఆరా తీశారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ మీటింగ్‌ గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించగా ఈ ఏడాది ప్రైవేటు విద్యా సంస్థ ల్లోనూ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తల్లి పేరిట ఒక మొక్కను పాఠశాల ఆవరణ లేదా వారి ఇంటి వద్ద నాటడం ఈ ఏడాది థీమ్‌గా తీసుకున్నట్టు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ టీ. నిషాంతి, డీఈవో సలీంబాషా డీఎంఅండ్‌ హెచ్‌వో దుర్గారావు దొర పాల్గొన్నారు. ప్రభుత్వ దాతలు, ప్రజలు భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలన లక్ష్యంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సచివాలయ సంక్షేమ, డిజిటల్‌ సహాయకులతో సమావేశం నిర్వహించారు. పీ4 కార్యక్రమం విధి విధానాలపై సమీక్షించారు.

బిల్లులు చెల్లించాలని  కాంట్రాక్టర్ల ధర్నా 1
1/1

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement