
కలెక్టరేట్ వద్ద ఉద్యాన సహాయకురాలి ధర్నా
అమలాపురం రూరల్: సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఉద్యాన సహాయకుల కౌన్సెలింగ్‌లో అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు అంబాజీపేట మండలం ముక్కామల సచివాలయం ఉద్యాన సహాయకురాలు రంప లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లాలో 52లో ర్యాంకుతో గతల నెల 29 తేదీన జరిగిన కౌన్సెలింగ్‌లో కొత్తపేట మండలం అవిడి– 2, వానపల్లి, మెడెకుర్రులో ఏదో ఒక చోటుకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకుంటే అవిడి–2కు బదిలీ ఇచ్చారని తెలిపారు. ఇంటికి వెళ్లిసరికి రాజకీయ వత్తిడితో ఆ బదిలీని రద్దు చేశారని వాపోయారు. దీనిపై ఉద్యాన శాఖ ఏడీ పీవీ రమణను కలవగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖినేటిపల్లి మండలం రామరాజు లంకకు బదిలీ చేసినట్టు చెప్పారన్నారు. చిన్నపిల్లలతో ఉన్న తనకు అవిడి–2కు బదిలీ ఇవ్వాలని ఆమె జాయింట్ కలెక్టర్ నిషాంతికి ఫిర్యాదు చేశారు.
లండన్ సీఎంఏ
సమావేశానికి ఆహ్వానం
అమలాపురం టౌన్: ప్రపంచంలో 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 18న లండన్‌లో జరగనున్న సర్వ సభ్య సమావేశానికి భారతదేశం నుంచి అమలాపురానికి చెందిన సీఎంఏ సభ్యుడు డాక్టర్ పీఎస్ శర్మ హాజరవుతున్నారు. ఈ మేరకు సీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. స్థానిక ప్రెస్‌క్లబ్ భవనంలో డాక్టర్ శర్మ సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ విషయం వివరించారు. సీఎంఏకు అనుబంధంగా పనిచేస్తున్న స్టాప్ టీబీ ఇనిషియేటివ్ సబ్ కమిటీ సభ్యుడిగా తాను నియమితులైన సంగతిని కూడా డాక్టర్ శర్మ తెలిపారు.

కలెక్టరేట్ వద్ద ఉద్యాన సహాయకురాలి ధర్నా