పిల్లలను చంపాడని భర్త గొంతుకోసిన భార్య | Wife Kills Husband By Slitting His Throat In Nagarkurnool | Sakshi
Sakshi News home page

పిల్లలను చంపాడని భర్త గొంతుకోసిన భార్య

Sep 19 2022 2:31 AM | Updated on Sep 19 2022 2:31 AM

Wife Kills Husband By Slitting His Throat In Nagarkurnool - Sakshi

ఓంకార్‌తో భార్య మహేశ్వరి, కుమారుడు  

కొల్లాపూర్‌ రూరల్‌: పిల్లలను హత్య చేశాడని కోపంతో రగలిపోయిన ఓ మహిళ తన భర్త గొంతుకోసి హత మార్చింది. తల్లితో కలిసి ఆమె ఈ హత్యకు పా ల్పడిన ఘటన వివరా లిలా ఉన్నాయి.  నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం కుడికిళ్లకు చెందిన ఓంకార్‌(40), మహేశ్వరి భార్యా భర్తలు. వీరికి కూతురు, కుమా రుడు ఉన్నారు. ఇటీవల భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో గత నెల 17న భార్య, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి సమీపంలో భా ర్యను బైక్‌పై నుంచి తోసేసి ఇద్దరు చిన్నారులను తీసుకొని వెళ్లిపోయాడు. కోడేరు మండలం నాగుపల్లి సమీపంలోని అడ్డగట్టు పైకి పిల్లలను తీసుకెళ్లి గొంతుకోసి, తాను కూడా కోసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా ఓంకార్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్‌ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. అప్ప టికే కోపంతో ఉన్న మహేశ్వరి ఆదివారం ఉదయం తన తల్లి జోగమ్మతో కలిసి ఓంకార్‌ గొంతును కోసి హత్య చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement