బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి.. ఆలస్యంగా వెలుగులోకి

Mother Sold Her Infant For 60 thousand Rupees Near Neredmet Ps - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నవ మాసాలు మోసి జన్మనించిన శిశువుని కన్న తల్లే అమ్మకానికి పెట్టిన ఘటన నెరేడ్‌‌మెట్‌ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ మహిళ ఇటీవల పాపకు జన్మనిచ్చింది. ఈనెల 12వ తేదీన ప్రసవం కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చిన బాధితురాలికి 10 రోజుల క్రితం పండంటి ఆడపిల్ల జన్మించింది. (25 మంది కిడ్నాప్‌!: నలుగురి హత్య)

ఏ కష్టం వచ్చిందో ఏమో గానీ బాధితురాలు పుట్టిన పసికందును తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌కు చెందిన వారికి 60 వేల రూపాయలకు విక్రయించింది. ఈ క్రమంలో డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తీసుకు రావాలని నేరెడ్‌మెట్‌ పోలీసులు కోరగా.. పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా.. పాపను విక్రయించినట్లు గుర్తించారు. పాపను సురక్షితంగా రక్షించిన పోలీసులు శిశువును ఘట్‌కేసర్.. ఎదులాబాద్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top