ఆ టీకాలను చూసి షాక్‌ తిన్న మహిళ

Maharashtra Woman Buys Fake Covid Vaccines On Worth 18k - Sakshi

ముంబై : కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకాలకు విపరీతంగా డిమాండ్‌ పెరిపోయింది. దీంతో మోసగాళ్ల కన్ను టీకాల మీద పడింది. నకిలీ టీకాలు అమ్మి సోమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ నకిలీ టీకాలను కొని మోసపోయింది. వివరాలు.. ముంబై, తిలక్‌ నగర్‌కు చెందిన ఓ మహిళకు కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ ఓ మెసేజ్‌ వచ్చింది. రెమెడెసివిర్‌ టీకాను హోం డెలివరీ చేస్తామని దాని సారాంశం. ఆ వాట్సాప్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసిన మహిళ ఆరు టీకాలను ఆర్డర్‌ చేసింది.

రెండు రోజుల తర్వాత ఇంటికి ఓ పార్శిల్‌ వచ్చింది. ఆమె రూ. 18 వేల రూపాయలు చెల్లించి పార్శిల్‌ను తీసుకుంది. దాన్ని విప్పి టీకాలను పరిశీలించి చూసి షాక్‌ తింది. టీకాలు ద్రవ రూపంలో కాకుండా పొడి రూపంలో ఉండటంతో అవి నకిలీవని గుర్తించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి, చదివించండి : ఉదయం 11 వరకే నిత్యావసర షాపులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top