Karnataka: అయ్యో.. ఎంత ఘోరం, స్నేహితులే చంపేశారు!

యశవంతపుర: డబ్బుల విషయమై యువకున్ని అతని స్నేహితులే హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో జరిగింది. ఓంకార, విజయ్, సునీల్, ధనరాజ్‌లు మంచి స్నేహితులు.
ఫైనాన్స్ వ్యవహారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న ఓంకార (30)ను మిగతా ముగ్గురు ఎపిఎంసీ యార్డుకు పిలుపించుకున్నారు. డబ్బు గురించి చర్చిస్తూ గొడవకు దిగారు. ఓంకారను సునీల్, ధనరాజ్, విజయ్‌లు తలపై బండరాయితో బాది హత్య చేశారు. ముగ్గురు నిందితులను తరీకెరె పోలీసులు అరెస్ట్ చేశారు.