Karimnagar: Gun Firing In Manakondur, Two Held - Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. అరుణ్‌ జస్ట్‌ మిస్‌! ఇంట్లో వాళ్లను చితకబాదిన రౌడీలు

Apr 20 2023 1:31 PM | Updated on Apr 20 2023 2:48 PM

Karimnagar Gun Firing Manakondur Two Held - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు రౌడీలు మరో రౌడీషీటర్‌పై తపంచాతో కాల్పులు జరిపారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాషబోయిన అరుణ్‌ అనే రౌడీషీటర్‌పై ఇద్దరు వ్యక్తులు అతని ఇంట్లోనే దాడికి పాల్పడ్డారు. అసలేం జరగుతుందో తెలుసునేలోపే తపంచాతో కాల్పులకు దిగారు. కొద్దిలో గురి తప్పడంతో అరుణ్‌ ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 

దీంతో ఆ ఇద్దరు రౌడీలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు. అరుణ్‌ ఎక్కడున్నాడో తెలపాలని కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఇది తెలుసుకున్న స్థానికులు అరుణ్‌ కుటుంబ సభ్యులను కాపాడారు. ఇద్దరు రౌడీలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు యాదాద్రి జిల్లాకు చెందిన పాల మల్లేష​్‌ మరొకరు మానుకొండూరుకు చెందిన బైరగోని మధు అని పోలీసుల విచారణలో తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement