వైద్యం ముసుగులో అసభ్యకర చేష్టలు.. 48 మంది మ‌హిళా రోగుల‌తో..

Indian Origin Doctor Harassments Against Female Patients - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అతనో వైద్యుడు.. రోగుల బాగోగులు చూసి ధైర్యం చెప్పాల్సిందిపోయి వారితోనే అసభ్యకరంగా ప్రవర‍్తించాడు. తన వద్దకు వచ్చిన మహిళా పేషెంట్లతో విచక్షణ మరచి మృగంలా వ్యవహరించాడు. వారికి ముద్దులు పెడుతూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన స్కాట్‌లాండ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప‍్రకారం.. భార‌త సంత‌తికి చెందిన డాక్ట‌ర్ కృష్ణ సింగ్(72) మ‌హిళా పేషెంట్ల‌తో అనుచితంగా వ్యవహరించాడు. స్కాట్‌లాండ్‌లో బీపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కృష్ణ సింగ్‌.. తన కేరీర్‌లోని 35 ఏండ్లలో సుమారు 48 మంది మ‌హిళా రోగుల‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. తన వద్దకు వచ్చిన మహిళా పేషంట్స్‌కు ముద్దులు ఇవ్వ‌డం, నెమ‌ర‌డం, అన‌వ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయించ‌డం, అస‌భ్య వ్యాఖ్య‌లు చేశారు. 1983 నుంచి 2018 మ‌ధ్య కాలంలో మ‌హిళా రోగుల‌తో డాక్ట‌ర్ కృష్ణ సింగ్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

నార్త్ ల‌నార్క్‌షైర్‌లో మెడిక‌ల్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో మ‌హిళా రోగులను సదరు డాక్టర్‌ లైంగికంగా వేధించిన‌ట్లు  గ్లాస్‌గోలోని హైకోర్టులో ప్రాసిక్యూట‌ర్ ఏంజిలా గ్రే వాదించారు. కాగా, 2018లో ఓ మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డాక్ట‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌పై విచార‌ణ ప్రారంభించారు. మొత్తం 54 అభియోగాల్లో కృష్ణ సింగ్‌ దోషిగా తేలాడు. ఇదిలా ఉండగా పేషెంట్లు చేసిన ఫిర్యాదుల‌ను సింగర్‌ త‌ప్పుప‌ట్టారు. ఇండియాలో వైద్య శిక్ష‌ణ తీసుకున్న స‌మ‌యంలో ఆ ప‌రీక్ష‌ల గురించి నేర్చుకున్న‌ట్లు సదరు డాక్ట‌ర్ చెప్పడం గమనార్హం. విచారణ అనంతరం ఈ కేసులో తీర్పును వ‌చ్చే నెల‌కు వాయిదా వేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top