చేతులు కాళ్లు కట్టేసి.. మర్మాంగాన్ని కోసేశాడు

Husband Murdered A Man Over Affair Suspicion In Sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల : గతంలో తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి అతడేననే అనుమానంతో గ్రామానికి వచ్చిన వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాహెల్‌హెగ్డే వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెకు చెందిన దొంతరవేణి బాలయ్య అనే వ్యక్తి తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని వేరుగా ఉంటున్నాడు. ఈక్రమంలో గతనెల 20న ఓ వ్యక్తి సోమరిపేట నుంచి రత్నగిరికి రాగా నీరంగా ఉండడంతో బాలయ్యకు చెందిన బంధువులు భోజనం అందించారు. ఇంటి సమీపంలోని ఇసుక దిబ్బలో నిద్రించగా అతడిని నమ్మించిన బాలయ్య గంభీరావుపేట మండలం గజసింగవరం అటవీప్రాంతంలోని దేవరగుట్టకు  తీసుకెళ్లాడు. చదవండి: ఏం కష్టం వచ్చింది బిడ్డా!  

అతడి బట్టలు విప్పి, చేతులు కాళ్లు కట్టేశాడు. హత్యచేయాలనే ప్రణాళికలో భాగంగా వెంట తెచ్చుకున్న బ్లేడుతో మర్మాంగాన్ని కోసేశాడు. అనంతరం పక్కన ఉన్న బండరాయితో తలపై కొట్టి చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం బాలయ్య ఇంటికి చేరుకున్నాడు. గుట్టపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై గ్రామంలో దర్యాప్తు చేయగా హత్య చేసిన బాలయ్యను ఎల్లారెడ్డిపేట సర్కిల్‌ పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తనకు తెలియదని బాలయ్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలకోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్‌ తదితరులు పాల్గొన్నారు. రా ఏజెంట్‌.. విడాకులు తీసుకున్న మహిళతో!


సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న గోదావరిఖని టూటౌన్‌ సీఐ–2 లక్ష్మీనారాయణ

భార్యను కడతేర్చిన భర్త
కమాన్‌పూర్‌(రామగుండం): కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన కోల స్వరూప(42)ను భర్త కోల తిరుపతి కడతేర్చిన విషాద సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల వివరాలు మేరకు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన స్వరూపను 23 ఏళ్లక్రితం జూలపల్లి గ్రామానికి చెందిన కోల తిరుపతికి ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని సంవత్సరాల తరువాత తిరుపతి భార్యాపిల్లలను పట్టించుకోకుండా స్వరూపను డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడు. గతంలో ఇంటి నుంచి వెళ్లిపోగా పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. కొద్దిరోజులకు తిరుపతి జూలపల్లి గ్రామానికి తిరిగొచ్చాడు. తిరిగి నెల్లూరు జిల్లాలోని పోర్టులో డ్రైవర్‌ పని చేస్తూ అప్పుడప్పుడు వచ్చి పోతున్నాడు.

గతేడాది ఇంటికి వచ్చి అప్పటి నుంచి డబ్బు కావాలని స్వరూపను వేధిస్తున్నాడు. ఇటీవల తిరుపతికి రూ.50 వేలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఇంట్లో గొడవ జరగగా స్వరూపను గొంతు నులిమి చంపి తిరుపతి పరారయ్యాడు. కరీంనగర్‌ ఆస్పత్రికి వెళ్లి వచ్చిన ఆమె కుమారుడు పవన్, కూతురు శృతి ఇంటి తలుపులు తీసి చూసే సరికి మంచంపై స్వరూప మృతిచెంది ఉంది. పథకం ప్రకారం గొంతునులిమి హతమార్చిన తిరుపతిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తమ్ముడు రాజేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్‌ సీఐ–2 లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంట కమాన్‌పూర్‌ ఎస్సై శ్యాంపటేల్, గోదావరిఖని టూటౌన్‌ ఎస్సై శ్రీనివాస్‌ ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top