భార్యా హంతకునికి  జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు

High Court Quashed Life Sentence To Husband In Wife Murder Case - Sakshi

బనశంకరి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో 2016లో వినాయక చవితి రోజున భార్య రాధ వంట చేయకుండా మద్యం తాగి పడుకుంది. కోపోద్రిక్తుడైన భర్త సురేశ్‌ కట్టెతో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. 2017లో స్థానిక కోర్టు అతనికి యావజ్జీవిత ఖైదు శిక్ష విధించగా అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. అతడు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. 

హైకోర్టు ఏం చెప్పిందంటే   
మంగళవారం కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కే.సోమశేఖర్, టీజీ శివశంకరేగౌడల ధర్మాసనం.. అతడు చేసింది ఉద్దేశపూర్వక హత్యగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఈ నేరాన్ని హత్యగా భావించలేమని, కాబట్టి హత్యానేరం సెక్షన్‌ను తొలగించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 6 ఏళ్లు జైలుశిక్ష అనుభవించడంతో, అతనిపై ఎలాంటి కేసులు లేకపోవడంతో తక్షణం జైలు నుంచి విడుద చేయాలని ఆదేశించారు.  

(చదవండి: ప్రేమిస్తే చంపేస్తారు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top