సాక్షి, మెట్‌పల్లి (కరీంనగర్): వంటలు రుచిగా తయారు చేయడంలేదని, బట్టలు సరిగ్గా ఉతకడంలేదంటూ తన భర్త పెట్టే మానసిక వేధింపులు తాళలేక ఫర్హానా బేగం(31) బలవన్మరణానికి ఒడిగట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గాజులపేటకు చెందిన ఫర్హానాబేగంకు నిజామాబాద్‌కు చెందిన వాజిద్దాన్‌తో 2016లో వివాహం జరిగింది. కొంతకాలం అక్కడే ఉన్నవారు.. ఆ తర్వాత మెట్‌పల్లికి వచ్చి స్థానిక వెల్లుల్ల రోడ్డులో నివాసం ఉంటున్నారు.
వీరికి చిన్నారి(15నెలలు) ఉంది. అయితే, వంటలు రుచిగా తయారు చేయడం లేదని, బట్టలు సరిగ్గా ఉతకడం లేదని వాజిద్దాన్ తన భార్యను తరచూ మానసికంగా వేధించేవాడు. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. దీంతో శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఫర్హానా బేగం చనిపోయింది. తన బావపై అనుమానం వ్యక్తం ఫార్హానాబేగం సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment