విషాదం మిగిల్చిన విహారయాత్ర | Boy dies in road accident | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన విహారయాత్ర

Jun 5 2024 11:20 AM | Updated on Jun 5 2024 11:20 AM

Boy dies in road accident

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం, ఇద్దరికి గాయాలు  

ఇబ్రహీంపట్నం రూరల్‌: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి యాత్రకు వెళ్లారు. అనంతరం దైవ దర్శనానికి బయలు దేరారు. అంతలోనే అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌కు చెందిన ఓ కుటుంబం చేపట్టిన విహారయాత్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో బాలుడిని బలిగొన్న ఘటన స్థానికంగా కలచి వేస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్ల దర్శన్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మూడు కార్లల్లో విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా భద్రాచలం నుంచి ములుగు జిల్లా మీదుగా తాడ్వాయి గుండా సమ్మక్క సారక్క వైపు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తాళ్ల అరుణ్‌ కుమారుడు శబరీశ్‌(9) అక్కడిక్కడే మృతి చెందాడు. 

కారు నడుపుతున్న అరుణ్, అతడి తండ్రి దర్శన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దర్శన్‌(60) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రీతాతలు ఆస్పత్రిలో ఉండగా పిల్లాడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేశారు. దీంతో కొంగరకలాన్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement