వి.కోట : ‘మీ పరిసరాల్లో పాములు కనిపిస్తున్నాయా.. వెంటనే నన్ను సంప్రదించడి’ అంటున్నాడు రాజ్ గోపాల్. ఈయన మండలంలోని బైరుపల్లి పంచాయతీ పెద్దరాంపల్లి గ్రామానికి చెందిన నల్లప్ప కుమారుడు. ఇతను పాములు పట్ట్టడంలో దిట్ట. ఈయన సొంతంగా పాములు పట్టడం నేర్చుకున్నారు. గత దాదాపు ఐదేళ్లుగా మండలంలో ఇప్పటివరకు 1,280 పాములు పట్టిన్నట్లు చెబుతున్నాడు. ప్రభుత్వం తన అనుభవాన్ని గుర్తించి ఉద్యోగం ఇస్తే స్నేక్ క్యాచర్‌గా రాణిస్తానని చెబుతున్నా రు. ఎక్కడైనా విషపూరితమైన పాములుంటే మొబైల్ నంబర్ 9493725774 ఫోన్ చేయాలని సూచించారు.
నిందితుల కస్టడీ పిటిషన్
చిత్తూరు అర్బన్: గంగాధరనెల్లూరులో ఓ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు దారిదోపిడీకి పాల్పడ్డ ఘటనలో నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐ ప్రసాద్ చిత్తూరు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దారిదోపిడీ కేసులో ఇప్పటికే జుడీషియల్ రిమాండులో ఉన్న గంగాధరనెల్లూరుకు చెందిన సెల్వం, లక్ష్మణ్‌కుమార్, తమిళనాడు వేలూరు జిల్లా సైదాపేటకు చెందిన ఇళంగోవన్, చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్‌ఐ లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవిచంద్రను విచారించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితులను కస్టడీకి ఇస్తే దర్యాప్తులో మరిన్ని విషయాలు తేలాల్సి ఉందని తెలిపారు. దీనిపై న్యాయస్థానం త్వరలోనే వాదనలు విననుంది.


