చిత్తూరు కలెక్టరేట్ : ఎంపీపీ, ఎంపీటీసీల గౌరవ వేతన బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపీ, ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పూతలపట్టు మండల సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో జెడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు ద్వారకనాథరెడ్డి, మురళి విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఎంపీపీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. పూతలపట్టు మండలంలో 13 ఎంపీటీసీలకు ఒక్కొక్కరికీ రూ.1.9 లక్షల చొప్పున గౌరవ వేతనం మంజూరైనప్పటికీ, క్షేత్ర స్థాయిలో అకౌంట్‌లలో జమకాలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ దొరస్వామిరెడ్డి, తేనేపల్లి వైస్ ప్రెసిడెంట్ నందగోపాల్, మండల జనరల్ సెక్రటరీ రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.


