బాదుడేంది బాబూ? | - | Sakshi
Sakshi News home page

బాదుడేంది బాబూ?

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

● చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఆటోకు తాళ్లుకట్టి లాగుతూ నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకి వినతి పత్రం సమర్పించారు. ● గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పంలో మాజీ మంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీరంగరాజపురం, గంగాధరనెల్లూరు, పాలసముద్రం, పెనుమూరు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ● పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్‌ ఆధ్వర్యంలో స్థానిక సిల్క్‌ ఫామ్‌ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి, నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ● పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని తవణంపల్లిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ర్యాలీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ధరలు తగ్గించాలని డిమాండ్‌

చిత్తూరు : ర్యాలీగా వెళ్తున్న సమన్వయకర్త విజయానందరెడ్డి, కార్యకర్తలు

వెదురుకుప్పం: టీడీకి వినతిపత్రం అందజేస్తున్న మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి

ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పించారు. యువగళం పాదయాత్ర పేరుతో నారా లోకేష్‌ సరిహద్దు రాష్ట్రాలకెళ్లి అక్కడి పెట్రో ధరలతో ఫొటో దిగారు. తాము అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాలకన్నా తక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్‌ అందిస్తామని ఊదరగొట్టారు. ఆపై అధికారం చేపట్టి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇష్టారాజ్యంగా పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన ర్యాలీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవకర్గ కేంద్రాల్లో ఆందోళనలు మిన్నంటించారు. ఎన్నికల హామీల ప్రకారం పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. బాదుడొద్దు బాబూ.. అంటూ నినదించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

సాక్షిప్రతినిధి, తిరుపతి: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుని నిరసిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు మిన్నంటించింది.

పెట్రో ధరల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

నగరిలో

నగరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బైపాస్‌ కూడలిలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఆందోళన చేపట్టారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

కుప్పంలో..

కుప్పంలో జాతర జరుగుతుండడంతో వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమానికి అమ నుతి ఇవ్వలేదు. నియోజకవర్గ సమ న్వయకర్త, ఎమ్మెల్సీ భరత్‌, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు.

చిత్తూరులో ఆటోకు తాళ్లు కట్టి లాగుతున్న

సమన్వయకర్త విజయానందరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement