దీన్ని ఏమందురు? | - | Sakshi
Sakshi News home page

దీన్ని ఏమందురు?

Dec 20 2025 7:11 AM | Updated on Dec 20 2025 7:11 AM

దీన్ని ఏమందురు?

దీన్ని ఏమందురు?

● శ్యాంపిల్స్‌ తీస్తున్నారు సరే.. లీకేజీలు మాటేమిటి? ● మద్యం నాణ్యతపై మందుబాబుల అనుమానాలు ● చిత్తూరులో పలు దుకాణాల్లో మద్యం బాటిళ్ల లీకేజీలు

నకిలీ మద్యంపై తనిఖీలు సరే.. లీకేజీలకు కారణం?

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో మద్యం విక్రయాలపై అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో లభిస్తున్న మద్యం బాటిళ్లలో.. కొన్ని లీకేజీలు అవుతున్నాయి. ఇవి కల్తీ మద్యమా..? ఒక కంపెనీ మద్యానికి బదులుగా మరో కంపెనీ మద్యం ఏదైనా మిక్డ్స్‌ చేస్తున్నారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

చిత్తూరులో ఇలా..

ఇటీవల చిత్తూరు నగరంలోని తిరుపతి రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో మద్యం తీసుకున్న వ్యక్తి, బాటి ల్‌ మూత నుంచి మద్యం లీకేజీ అవుతుండడాన్ని గమచించారు. ఇదేమిటని దుకాణ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే లీకేజీ అవుతున్న బాటిల్‌ తీసుకుని, మరో బాటిల్‌ ఇచ్చి పంపిచేశాడు. కానీ బాటిల్‌ మూత లీకేజీ అవుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్యాంపిల్స్‌ తీస్తున్న ఎకై ్సజ్‌ పోలీసులు ల్యాబ్‌కు వీటిని పంపిస్తే ఇందులో ఏదైనా కల్తీ జరిగిందా..? రసాయనాలు ఉండాల్సిన పరిమాణంకంటే ఎక్కువగా ఉన్నాయా..? అనే రిపోర్టు వస్తుంది తప్ప.. రూ.300 విలువ చేసే మద్యంలో చీప్‌లిక్కర్‌ కలిపారా..? అనే నివేదిక రాదు. దీన్ని అలుసుగా చేసుకుని కొందరు వ్యాపారులు మద్యం బాటిళ్ల మూతలను చాకచక్యంగా తొలగించి, అందులో తక్కువ ధర ఉన్న మద్యాన్ని కలుపుతున్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తనిఖీల సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో బాటిళ్లను పరీక్షించకుండా, దుకాణ నిర్వాహకులు ఇచ్చే నెలవారి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

తనిఖీలు నామమాత్రం

అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో గతేడాది అక్టోబర్‌లో 104 ప్రైవేటు మద్యం దుకాణాలను బాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక కల్లుగీత సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకు మరో పది దుకాణాలను కేటాయించింది. జిల్లాలో నెలకు సగటున రూ.33 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతీ నెలా ఆయా ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్లలోని అధికారులు దుకాణాలు తనిఖీలు చేసి, అక్కడ ఉన్న ఏదో ఒక మద్యాన్ని తీసుకుని, వాటి నాణ్యత పరీక్షించడానికి ల్యాబ్‌కు పంపడం వారి విధినిర్వహణలో భాగంగా జరుగుతోంది. కానీ ఎకై ్సజ్‌ అధికారులు శ్యాంపిల్స్‌ సేకరించే ప్రక్రియ ఓ యాంత్రికంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా రూ.99 మద్యం తీసుకుని.. రూ.300 ధర ఉన్న బాటిళ్లల్లో పోసి, విక్రయిస్తున్నారని పలువురు మద్యం ప్రియులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement