విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

Dec 20 2025 7:11 AM | Updated on Dec 20 2025 7:11 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

చౌడేపల్లె: విధ్యుతాఘాతానికి గురై ఆవు మృతి చెందిన ఘటన మండలంలోని ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రైతు మోహన్‌నాయుడు తన ఆవును మేత కోసం గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి తోలుకెళ్లాడు. అక్కడ విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేసిన కొయ్యలు విరిగి కింద పడడంతో ఆ వైర్లు తగిలి షాక్‌కు గురై ఆవు మృతిచెందింది.

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..!

బంగారుపాళెం: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. సీఐ శ్రీనివాసులు కథనం.. తిరుపతి జిల్లా, బైరాగిపట్టెడకు చెందిన వడ్డె రాజరాజు సమీప బంధువు వి కోటలో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం నాగరాజు అతని అన్నకుమారుడు మణికంఠతో కలసి ద్విచక్ర వాహనం(స్కూటీ)పై వెళ్లారు. ఆపై అంత్యక్రియలు ముగి సిన తరువాత స్కూటీపై తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో మండలంలోని నలగాంపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున నాగరాజు(55) నిద్రమత్తులో కింద పడ్డాడు. తలకు బ లమైన గాయం తగలడంతో మృతి చెందాడు.

చలి మంటలో పడిన

వృద్ధుడి మృతి

రొంపిచెర్ల: చలిమంటలో పడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని బండ మీదపల్లెకు చెందిన మునిశేఖర్‌ (64) ఈ నెల 2వ తేదీన మద్యం సేవించి వీధిలో వేసిన చలి మంటలో చలి కాచుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.

మూడు దుకాణాల్లో చోరీ

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని మూడు దుకాణాల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. కట్టమంచిలోని ఓ ద్విచక్ర వాహన షోరూమ్‌, సూపర్‌ మార్కెట్‌, సిమెంటు దుకాణాల్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. దాదాపు రూ.50 వేల వరకు నగదు చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

తప్పుడు సాక్ష్యంపై విచారణ

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు మాజీ మేయర్‌ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ జంట హత్యల కేసులో న్యాయ స్థానంలో తప్పుడు సాక్ష్యం చెప్పిన కేసు విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తూ చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు – ప్రత్యేక మహిళా కోర్టు ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి డా.ఎన్‌.శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. కేసు విచారణలో భాగంగా తప్పుడు సాక్ష్యం చెప్పిన ఘటనలో 14 మంది శుక్రవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. వీళ్లల్లో ఏడుగురు రాత పూర్వక సంజాయిషీని న్యాయమూర్తికి అందించారు. మరో ఏడుగురు కొంత సమయం అడగడంతో వచ్చే నెల 2వ తేదీ వరకు సమయమిస్తూ, అదే రోజు కేసు విచారణ చేయనున్నట్లు ప్రకటించారు.

సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ప్రకాష్‌

ఐరాల: జాతీయస్థాయి సబ్‌ జూనియర్స్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రకాష్‌ ఎంపికై నట్లు హెచ్‌ఎం వాసుదేవన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రకాష్‌ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు వెల్లడించారు.

పాకాల: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి గ్రామంలోని నీటి ట్యాంకు కింద మృతదేహం కుళ్లిపోయి, కనిపించింది. మృతుడు వచ్చిన ద్విచక్ర వాహనం మండలంలోని పదిపుట్లబైలు సమీపంలో పంటపొలాల్లో పడి ఉంది. దీనిపై ఈ నెల 16న పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నంబర్‌ ఆధారంగా స్కూటరిస్ట్‌ అడ్రస్‌ను తెలుసుకుని పీలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెల్డింగ్‌ షాపు యజమాని, మృతుని తల్లి ఇరువురూ స్కూటర్‌ వద్ద దొరికిన ఆధార్‌కార్డుతో మృతుడు చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలం, జి.కురూపపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు డి.చిట్టిబాబుగా (24)గా గుర్తించారు. మృతుడు పీలేరులోని ఓ వెల్డింగ్‌ షాపులో హెల్పర్‌గా పనిచేసేవాడు. ఈ నెల 15 రాత్రి వెల్డింగ్‌ షాపు ఓనరు ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలు దేరాడు.

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి 
1
1/3

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి 
2
2/3

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి 
3
3/3

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement