ఐదుగురి అరెస్ట్
బంగారుపాళెం: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి శుక్రవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కాటప్పగారిపల్లె వద్ద అక్టోబర్ 15న జాతీయ రహదారిపై కారు (కేఏ05 ఎండీ4456)వేగంగా వెళ్తు డివైడర్‌ను ఢీకొని రైట్ సైడ్‌లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారునిపైకి దూసుకెళ్లింది. ఆపై రహదరి పక్కన కాలువళక్ష బోల్తాపడింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్, కారులో ఉన్నవారు అక్కడి నుంచి పరారయ్యారు. కారును పరిశీలించగా అందులో 9 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో చిత్తూరు గ్రీమ్స్‌పేటకు చెందిన రాజశేఖర్(33), నవీన్(34), రాకేష్(30), పునీత్‌కుమార్(24), ముఖేష్(22)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. చిత్తూరు టౌన్‌కు చెందిన ఆరీఫ్, కర్ణాటక రాష్ట్రం కటికినహళ్లికి చెందిన సయ్యద్‌ఫైరోజ్, తిరువణ్ణామలై జిల్లా జమునముత్తూరుకు చెందిన అజిత్, గోవింద్‌ను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు.
జాతీయ స్థాయి పోటీలకు రాజుపల్లె విద్యార్థి
పెద్దపంజాణి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు అండర్–14 విభాగంలో మండలంలోని రాజుపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.చరణ్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయడు జనార్ధనరెడ్డి తెలిపారు. శుక్రవారం విద్యార్థికి అభినందనలు తెలిపారు. పీడీ దొరై పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు పచ్చికాపల్లం విద్యార్థులు
వెదురుకుప్పం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు పచ్చికాపల్లం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు హిమజ, పూజిత, హేమంత్, మోక్షిత్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ దామోదరం, పాఠశాల కమిటీ చైర్మన్ చెంగల్రాయులు, పీడీ చెన్నకేశవులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్: పురోగమిస్తున్న విజ్ఞానశాస్త్ర అభివృద్దిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజానికి అవసరమైన కొత్త ఆవిష్కరణలు తయారుచేసే విధంగా ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎంపికై న వారు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. చుడా చైర్‌పర్సన్ హేమలతో, జిల్లా సైన్స్ అధికారి అరుణ కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు
రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి తొమ్మిది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.
ఐదుగురి అరెస్ట్
ఐదుగురి అరెస్ట్


