అయ్యో..తులసీ
నగరి : నగరి మండలంలోని ఎం.కొత్తూరు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విలేజ్ సర్వేయర్ టీ.తులసీరామ్ (29) మృతిచెందాడు. పోలీసులు తెలి పిన సమాచారం మేరకు.. విజయపురం మండలం, కాళికాపురం సచివాలయలో విలేజ్ సర్వేయర్‌గా తులసీరామ్ విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు డీఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావడానికి నగరికి స్కూటర్‌పై వస్తుండగా దేశమ్మ దేవాలయ సమీపం, ఎం.కొత్తూరు మార్గంలో ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన తులసీరామ్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నగరి మున్సిపాలిటీ నగరిపేటకు చెందిన ఇతను ఇటీవల గుడుపల్లి మండలం, చీకటిపల్లికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై కాళికాపురం సచివాలయంలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావడానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందాడు. మృతినికి రెండేళ్ల క్రితమే వివాహమైంది. భార్య, ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది.
నిత్యం సర్వేలు, కాన్ఫరెన్స్‌లు
ఇటీవల బాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు నిత్యం ఏదో ఒక సర్వే, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తోంది. వారు కుదురుగా సచివాల యాల్లో ఉండడమే లేదు. ఇలా తిరగడమే నేడు ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయ్యో..తులసీ


