బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
వెదురుకుప్పం: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని పోక్సో చట్టం కింద శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్ కథనం మేరకు.. వెదురుకుప్ప మండలం, ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన ఓ బాలిక(14) ఆగస్టు 24వ తేదీ 11 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన శంకరయ్య కుమారుడు డి.మురళి (49) బాలిక ఇంటికి వెళ్లాడు. ఆపై బాలికను బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయపడి బాలిక ఎవ్వరికీ చెప్పలేదు. అయితే అప్పుడప్పుడూ బాలికకు కడుపునొప్పి వచ్చేది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గురువారం తల్లిదండ్రులు బాలికను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించడంతో 22 వారాల గర్భం ఉన్నట్టు తేలింది. అవాకై ్కన బాలిక తల్లిదండ్రులు వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం తన కుమార్తైపె లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మురళిపై వెదురుకుప్పం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా శుక్రవారం సాయంత్రం దేవళంపేట వద్ద పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు 2012లో ఓ కేసులో నేరస్తుడని తెలిపారు. డీఎస్పీ వెంట కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ నవీన్‌బాబు ఉన్నారు.


