ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవద్దు
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వం ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడి తేవద్దని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సాయంత్రం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛగా బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీమ్ పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ సెలవు రోజులైన ఆదివారం, రెండో శనివారం, పండుగ రోజుల్లో పనిచేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. అనంతరం డీఈవో రాజేంద్రప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.


