జిల్లాలో పింఛన్ల సమాచారం
దివ్యాంగుల పింఛన్లు
34,538
మొత్తం పింఛన్లు
2,68,066
చిత్తూరు: సదరం రీవెరిఫికేషన్‌కు వచ్చిన దివ్యాంగులు (ఫైల్)
రీవెరిఫికేషన్‌లో అనర్హులుగా
2,000
కాణిపాకం: దివ్యాంగులు సదరం స్లాట్లకు పాట్లు పడుతున్నారు. పనిచేయని సదరం పోర్టల్‌తో కుస్తీ పడుతున్నారు. రెండు రోజులు మాత్రమే పోర్టల్ తళుక్కుమని మాయమైంది. తర్వాత సైట్ మొరాయిస్తోంది. సచివాలయాల చుట్టూ దివ్యాంగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. స్లాట్ సతాయించడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.
మొదటి నుంచీ వివక్షే
జిల్లాలో దివ్యాంగులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారికి రీ వెరిఫికేషన్ పేరుతో కోత విధించిన చంద్రబాబు ప్రభుత్వం, కొత్త వారికి ధ్రువపత్రాల జారీలోనూ వివక్ష చూపుతోంది. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ కోసం వైద్య పరీక్షలకు దరఖాస్తు చేసుకుందామని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళితే అక్కడి సిబ్బంది సదరం సైట్ మొరాయిస్తోందని చెబుతున్నారు. గతంలో ఆన్‌లైన్ చేసిన వారికి వెయిటిం గెస్ట్ ఇచ్చారు. దానికి సంబంధించి కొందరికి పరీక్ష తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు పూర్తి స్థాయి వైకల్యం ఉండి, మంచంలోనే ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకూ ఆ సైట్ ఓపెన్ కాలేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కెళ్లి అర్జీలిచ్చి ఆశగా ఎదురు చూస్తున్నారు.
స్లాట్ బుకింగ్ ఏదీ
గత నవంబర్ 10న సదరం స్లాట్ బుకింగ్‌కు మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటన విడుదల చేసింది. గతనెల 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఓ రెండు రోజులు మాత్రం సైట్ ఓపెన్ అయ్యి.. తర్వాత మూగబోయింది. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా స్లాట్ బుకింగ్‌కు సుమారు 15 వేల మంది దాకా ఎదురుచూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఆప్షన్ కనిపించడం లేదు
దివ్యాంగుల్లో పూర్తి వైకల్యంతో మంచంపైనే ఉన్న వారికి రూ.15వేల పింఛన్ ఇస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉన్న వారు సందరం ద్వారా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ధ్రవ పత్రాలు తీసుకున్నారు. వాటిని మరళా అప్‌లోడ్‌చేస్తేనే పింఛన్‌కు అర్హత సాధిస్తారు. ఆ సైట్‌లో ఆ ఆప్షన్ కనిపించడం లేదని దివ్యాంగులు చెబుతున్నారు. నవంబర్ నెలంతా మొరాయించిందని వాపోయారు. డిసెంబర్ నెల వెళ్లి చూస్తే స్లాట్ ఫుల్‌అని చూపిస్తోందని అంటున్నారు.
వేధిస్తున్నారు
భార్యకు మోకాలు పగిలి పోయింది. వికలాంగులనీ చూడకుండా సదరం సర్టిఫికెట్ పేరుతో వేధిస్తున్నారు. ముందుగా చిత్తూరు నుంచి కార్వేటి నగరానికి పంపారు. ఇలా రెండు సార్లు వెళ్లాం. అక్కడ వెరిఫై చేసి మళ్లీ కార్వేటినగరానికి పంపించారు. ఇలా ఎన్నిసార్లు తిప్పుకుంటారో అర్థం కావట్లేదు. కూలి పని వదులుకొని తిరుగాల్సి వస్తోంది. వాళ్లు ఇచ్చే పెన్షన్ కోసం ఇన్ని ఇబ్బందులు అవసరమా.
– వెంకటాచలం, అమ్మన్ కోయిల్ వీధి, చిత్తూరు
అవస్థలు పడుతున్నాం
అంగవైకల్య నిర్ధారణ పరీక్షల కోసం దివ్యాంగులు వ్యయప్రయాసాలకోర్చి వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక చోట సదరం సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. వారంలో ఒక రోజు డాక్టర్లు వచ్చి క్యాంపునకు వచ్చే దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి అంగవైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. వారికి ఇష్టం వచ్చిన చోట సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతంలో బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించేవారు. నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ అక్కడికి వచ్చి సర్టిఫికెట్లు పొందేవారు. ఇప్పుడు ఇబ్బందులు పడాల్సివస్తోంది.
–రఘుపతిరాజు, వైఎస్సార్‌టీయూ జిల్లా కార్యదర్శి, బంగారుపాళ్యం
సదరంరీవెరిఫికేషన్‌కు వచ్చిన
దివ్యాంగులు
(ఫైల్)
సదరం కోసం ఎదురుచూస్తున్న వారు
సుమారు 15వేల మంది
జిల్లాలో పింఛన్ల సమాచారం
జిల్లాలో పింఛన్ల సమాచారం
జిల్లాలో పింఛన్ల సమాచారం
జిల్లాలో పింఛన్ల సమాచారం


