రెండు కళ్లూ లేవు
– 8లో
అవినీతి తిమింగలాలు
పుంగనూరులో తిష్టవేసిన అవినీతి రెవెన్యూ తిమింగలాలు పట్టుబడ్డాయి. ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ చిక్కాయి.
సర్వర్ పనిచేయడం లేదంట
ఈమె పేరు టి.నాగమ్మ. తడుకు ఎస్టీ కాలనీ. ఈమెకు రెండు కళ్లు లేవు. గత ప్రభుత్వంలో ఈమె వేలిముద్రలు పడకపోవడం, ఐరిష్ తీయలేక ఆధార్ కార్డు పొందకపోయింది. అప్పటి వలంటీర్ ఈమెను తీసుకెళ్లి కంటిని ఓ మేరకు తెరిపించి ఐరిష్ తీయించి ఆధార్ కార్డు వచ్చేలా చేశారు. ఆపై దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. వలంటీర్ వ్యవస్థను బాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇరుగుపొరుగు వారి సాయంతో వెళ్లి ఒకమారు సదరంలో దరఖాస్తు చేసుకుంది. అయినా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మరోమారు సదరంలో దరఖాస్తు చేసుకుందామంటే తీసుకెళ్లేవారు లేని నిస్సహాయ స్థితిలో ఉంది.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు జీ.వెంకటప్ప. ఐరాల మండలం, గూబలవారిపల్లె. ఈయన గత ఏడాది గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేసుకున్నాడు. ఈయన దివ్యాంగ పింఛన్ కోసం గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం సచివాలయంలో స్లాట్ బుకింగ్ కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు. అక్కడి సిబ్బంది సర్వర్ పనిచేయడం లేదు.. రేపు రండి చూద్దాం అంటూ తిప్పి పంపిస్తున్నారు. ఏడాదిగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కాస్త ఓపిక తెచ్చుకొని సచివాలయానికి వెళ్లితే మీ ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లండి ఫోన్ చేస్తాం అంటూ సిబ్బంది తిప్పిపంపుతున్నారని వాపోతున్నాడు.
రెండు కళ్లూ లేవు


