కోతకు కుట్ర
చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లలో కోతపెట్టేందుకు కుట్ర పన్నుతోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దివ్యాంగులపై కత్తి పెట్టింది. బోగస్ పేరుతో వారిని తిప్పించుకుంది. రీ వెరిఫికేషన్ పేరుతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణ చేయించింది. అర్హులుగా ఉన్నవారిని కూడా అనర్హులుగా వేటు వేసింది. దీంతో వారంతా రోడెక్కారు. వీటిని కప్పి పుచ్చేందుకు మళ్లీ వెరిఫికేషన్ అంటూ ఆశజూపింది. తర్వాత సదరం స్లాట్‌ను తెరపైకి తీసుకొచ్చి..మాయ చేసింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల సంఖ్యను కుదించేందుకు చేస్తున్న కుట్ర అని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు.


