అమ్మో..చలి పులి!
సోలార్ పథకాలపై సమీక్ష
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జరుగుతున్న సోలార్ పథకాలపై ట్రాన్స్‌కో డైరెక్టర్ అయూబ్‌ఖాన్ అధికారులతో సమీక్షించారు. మంగళవారం ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో పలు అంశాలపై మాట్లాడారు. వ్యవసాయానికి సోలార్ ద్వారా విద్యుత్‌నిచ్చే పీఎం కుసుం పథకం పనులు త్వరలో ప్రారంభంకానున్నట్టు తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వాటిని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించమన్నారు. జిల్లాలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వాడుతున్న ఎస్సీ, ఎస్టీ సర్వీసులకు ఉచితంగా సోలార్ ఫలకాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 2 సబ్‌స్టేషన్లు మంజూరు చేశారన్నారు. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సోలార్ జీఎం విజయన్, ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, శ్రీనివాసమూర్తి, భాస్కర్‌నాయుడు, పీఓ రెడ్డెప్ప పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనం చోరీపై కేసు
బంగారుపాళెం: ద్విచక్ర వాహనం చోరీపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళెం జెండా మాను వీధిలో నివాసముంటున్న రియాజ్ తన ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ ఏపీ40 డీయూ 8586)ని ఈ నెల 11వ తేదీన స్థానిక కుసుమ హోటల్ వద్ద పార్కు చేసి ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కబ్జాదారునిపై ఫిర్యాదు
బంగారుపాళెం: మండలంలోని మొగిలి వద్ద పాఠశాల స్థలం, శ్మశాన స్థలం కబ్జా చేసిన ఆక్రమణదారుడిపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్, ప్రిన్సిపల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండలంలోని మొగిలి ఊరగుట్ట వద్ద గిరిజన గురుకుల పాఠశాల నిర్మా ణానికి కేటాయించిన స్థలం, గిరిజనులు వినియోగించుకుంటున్న శ్మశాన స్థలాన్ని మొగిలి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆదివారం ఆక్రమించుకుని చదును చేసిన విష యం తెలిసిందే. భూకబ్జాపై సోమవారం సాక్షి దినపత్రికలో శ్రీటీడీపీ నాయకుల భూకబ్జాశ్రీ శీర్షకన కథనం ప్రచురితమైంది. పాఠశాల, శ్మశాన స్థలాలను కబ్జాచేసిన మొగిలి గ్రామానికి చెందిన ఏకాంబరంనాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ షబ్బీర్‌బాషా, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరులో గజగజ
పలమనేరులో మంచు దుప్పటి
పలమనేరులో పరిస్థితి ఇదీ..
అమ్మో..చలి పులి!
అమ్మో..చలి పులి!
అమ్మో..చలి పులి!


